The Goat OTT Run Time: దళపతి విజయ్ తాజా చిత్రం ‘ది గోట్’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్లు విషయంలో సత్తా చాటుతున్నది. సుమారు నాలుగు రోజుల్లో రూ. 280 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ‘ది గోట్’ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. థియేట్రికల్ రన్ టైమ్ తో పోల్చితే ఓటీటీ రన్ టైమ్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.


సుమారు 37 నిమిషాలు పెరగనున్న ఓటీటీ రన్ టైమ్


రీసెంట్ గా ‘ది గోట్’ మూవీ 3 గంటల 3 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్లలో విడుదలైంది. ఓటీటీలో మాత్రం ఈ మూవీ నిడివి పెరగనుంది. సుమారు 37 నిమిషాల పాటు యాక్షన్ సీన్లు, సాంగ్, విజయ్ కామెడీ సీన్లను యాడ్ చేయనున్నట్లు దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించారు.  మొత్తంగా ఓటీటీలో ఈ మూవీ 3 గంటల 40 నిమిషాల పాటు ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.


అక్టోబర్ 25 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్?


ఇక ‘ది గోట్’ మూవీ ఓటీటీ హక్కులను థియేట్రికల్ రిలీజ్ కు ముందే నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీ అక్టోబర్ లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.  



‘ది గోట్’ స్టోరీపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్


‘ది గోట్’ సినిమాలో విజయ్ డ్యుయెల్ రోల్ పోషించాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్లు చేశాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ నటన, డ్యాన్స్, బాగున్నా, సినిమా కథ, విజయ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పాత చింతకాయ పచ్చడి లాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు ఇప్పటికైనా కొత్త కథలతో ట్రై చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ‘ది గోట్’ మూవీలో మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరోయిన్ త్రిష స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. తన కెరీర్ లో తొలిసారి స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. ఈ సినిమాలో  ప్ర‌శాంత్‌, ప్ర‌భుదేవా, జ‌య‌రాం కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. శివ‌ కార్తికేయ‌న్‌, ధోనీ గెస్ట్ పాత్ర‌ల్లో కనిపించి ఆడియెన్స్‌ కు స‌ర్‌ ప్రైజ్ ఇచ్చారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.



Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'