Tamannaah About Her Heartbreaks: మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తోంది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరో వైపు స్పెషల్ సాంగ్స్ తోనూ దుమ్ము రేపుతోంది. రీసెంట్ గా ‘స్త్రీ 2’లో ఐటెమ్ సాంగ్ తో అదరగొట్టింది. అమ్మడు స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన కెరీర్ లో ఎదురైన బాధాకరమైన విషయాల గురించి వెల్లడించింది.    


రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయ్యింది- తమన్నా


తన లైఫ్ లో ఇప్పటి వరకు పలు ఎదురు దెబ్బలు తిన్నట్లు తమన్నా వెల్లడించింది. రెండుసార్లు ప్రేమలో విఫలమై బాధపడ్డట్లు చెప్పుకొచ్చింది. “నా జీవితంలో రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయ్యింది. ఆ టైమ్ లో ఎంతో పెయిన్ అనుభవించాను. టీనేజ్ లో ఉన్నప్పుడే తొలిసారి బ్రేకప్ అయ్యింది. ఒక వ్యక్తి కోసం మనకు ఇష్టమైన లైఫ్ ను వదులుకోవడం నాకు నచ్చలేదు. జీవితంలో ఎంతో సాధించాలని, కొత్త విషయాలను తెలుసుకోవాలనుకున్నాను. ఆ కారణంతోనే తొలిసారి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్నాను. అతడు కూడా నాకు సరిపోడు అనిపించింది. ప్రతి విషయంలో తను అబద్దం చెప్పేవాడు. నాకు అబద్దాలు చెప్పే వాళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తితో రిలేషన్ షిప్ కొనసాగించడం మంచిది కాదనుకున్నాను. ఆ బంధం కూడా ఎక్కువకాలం నిలువలేకపోయింది. లవ్ బ్రేక్ అయిన ప్రతిసారి ఎంతో బాధను అనుభవించాను” అని చెప్పుకొచ్చింది.


విజయ్ వర్మ మూడో బాయ్ ఫ్రెండా?


తన బ్రేకప్స్ గురించి తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న నేపథ్యంలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంటే, విజయ్.. మూడో బాయ్ ఫ్రెండా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తమన్నా హృదయం చాలా పెద్దది.. ఎంత మందికైనా అందులో చోటు ఉంటుందని మరికొంతమంది సటైర్లు వేస్తున్నారు.  


రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న తమన్నా


మిల్కీ బ్యూటీ తమన్నా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో పలు సినిమాల్లో నటించింది. మంచు మనోజ్ ‘శ్రీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ‘హ్యాపీ డేట్స్’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు టాలీవుడ్ అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసింది. రీసెంట్ గా ‘జైలర్’ సినిమాలో ‘కావాలయ్యా’ పాటతో దుమ్మురేపిన తమన్నా.. తాజాగా ‘స్త్రీ2’లో స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది. మరోవైపు వెబ్ స్టోరీస్ లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ‘ఓదెల 2’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నది.  



Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'