Kalki First Day Collections:  థియేటర్‌లో 'కల్కి 2898 ఏడీ' సందడి మొదలైంది. ఇక మూవీకి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే.. బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లు కురిపించడం పక్కా అంటున్నారు. గురువారం జూన్‌ 27న థియేటర్లోకి వచ్చిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆడియన్స్‌ నుంచి ఊహించని దానికంటే రెస్పాన్స్‌ తెచ్చుకుంటుంది. ఇండియా వైడ్‌ కల్కి విడుదలైన అన్ని థియేటర్లు హౌజ్‌ఫుల్‌ కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్‌ వరకు కూడా అడ్వాన్స్‌ బుకింగ్‌ అయిపోయాయి. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో రికార్డు నెలకొల్పిన కల్కి ఫస్ట్‌ డే భారీగా వసూళ్లు చేసి ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీయఫ్‌ చిత్రాల రికార్డును బ్రేక్‌ చేసింది.


వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా ఫస్ట్‌ డే రూ. 180 కోట్ల గ్రాస్‌ రాబట్టిందట. ఇక ఇండియా వైడ్‌గా ఈ మూవీ తొలి రోజే రూ. 115 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కల్కి ఊహించని వసూళ్లు రాబట్టిందట. ముఖ్యంగా ఒక్క నైజాం ఏరియాల్లో సర్‌ప్రైజింగ్‌ కలెక్షన్స్‌ రాబట్టిందట. దీంతో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రికార్డును అక్కడ బ్రేక్‌ చేసింది కల్కి. ఫస్ట్‌డే నైజాంలో రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ (రూ.23.55 కోట్లు) మూవీ పేరిట ఉన్న రికార్డు తాజాగా కల్కి కొల్లగోట్టింది. కాగా బాహుబలి తర్వాత ప్రభాస్‌ సినిమాలు ఫలితంతో సంబంధిం లేకుండ కలెక్షన్స్‌ రాబడుతుంది. మూవీ అప్‌డేట్స్‌ నుంచి రిలీజ్‌ వరకు అన్నింటిలో టాప్‌లో దూసుకుపోతూ రికార్ట్స్‌ నెలకొల్పుతున్నాడు ప్రభాస్.



అలా పాత రికార్డ్స్‌ని బ్రేక్‌ చేస్తూ.. కొత్త రికార్డ్స్‌ సృష్టిస్తున్నాడు. ఇదిలా ఉంటే 'మహానటి' ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, నటి శోభన వంటి భారీ తారగణంతో రూపొందిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్‌ రూ. 600 కోట్ల వ్యయంతో మూవీని నిర్మించాడు. నాగ్‌ అశ్విన్‌ తన విజన్‌తో పురాణాలకు సైన్స్‌ ఫిక్షన్‌ జోడించి కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అద్భుతమైన విజువల్స్‌, వీఎఫ్‌ఎక్స్‌తో విజువండ్‌ క్రియేట్‌ చేశాడు. ఇక ఇందులో దర్శక ధీరుడు రాజమౌళి, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌లు అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. 


Also Read: రేణుకా స్వామి హత్య కేసు - కన్నడ హీరో దర్శన్‌కు మద్దతుగా నాగశౌర్య షాకింగ్‌ పోస్ట్‌