Naga Shourya Support to Kannada Hero Darshan: కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ అభిమాని రేణుక స్వామి హత్య కేసులో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.  ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన దర్శన్‌ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆయనతో పాటు నటి పవిత్ర గౌడ, ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ కూడా ఈ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. మొత్తం ఈ కేసులో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణ షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి.దర్శన్‌ సుపారి ఇచ్చిన రేణుకస్వామిని హత్య చేయించినట్టు రుజువు అయ్యింది. ఈ కేసులో బయటకు వస్తున్న విషయాలను చూసి అంతా షాక్‌ అవుతున్నారు.


దీంతో సోషల్‌ మీడియాలో, జనాల్లో దర్శన్‌కు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం రేణుకస్వామి హత్య కేసు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే, మొదట ఈ కేసు విషయం బయటకు రాగానే సినీ ఇండస్ట్రీ వారు ఆయన అలాంటి వాడు కాదంటూ సపోర్ట్‌ ఇచ్చారు. ఇక కేసులో నిజానిజాలు బయటకు వస్తున్న కొద్ది అంతా సైలెంట్‌ అయ్యారు.ఈ క్రమంలో దర్శన్‌కి సపోర్ట్‌ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఈ విషయమై ఇంతవరకు మన టాలీవుడ్‌ హీరోలు, నటీనటులు స్పందించలేదు. కానీ యంగ్‌ హీరో నాగశౌర్య స్పందిస్తూ సంచలన పోస్ట్‌ పెట్టాడు.  ఈ మేరకు నాగశౌర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద నోట్‌ షేర్‌ చేశాడు. అంతేకాదు ఈ పోస్ట్‌కి కామెంట్‌ సెక్షన్‌ డిసేబుల్‌ చేయడం గమనార్హం. నాగశౌర్య తన ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చాడు. 


"ఈ ఘటనలో బాధితుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. అయితే ఈ విషయమై ప్రజలు స్పందిస్తూ తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే దర్శన్‌ అన్న అంటే ఏంటో తెలిసినవారు ఆయన ఇలా చేశాడంటే నమ్మలేరు. ఆయన కలలో కూడా ఒకరికి హాని చేయాలనుకోరు. ఆయన దయ గుణం అలాంటిది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఈ విషయంలో ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా ఉన్నారు. దర్శన్‌ అన్న చేశారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మన న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం ఏంటనేది బయటకు వస్తుందని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.






అలాగే "బాధితుడి కుటుంబంతో పాటు ఇక్కడ మరో కుటుంబం కూడ ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ వార్తల వల్ల వారు కూడా బాధపడతారని అర్థం చేసుకోవాలి. ఈ కష్టకాలంలో వారికి వ్యక్తిగత గొప్యత, మనోధైర్యం అవసరం. అన్న దయా గుణం గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఆయన నిర్దోషిగా బయటికి వస్తాడని, నిజమైన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా..’ అంటూ దర్శన్‌కు మద్దతుగా ఉంటానంటూ పోస్ట్‌ చేశాడు. అంతేకాదు తన పోస్ట్‌కి కామెంట్స్‌ సెక్షన్‌ కూడా డిసేబుల్‌ చేశాడు. రేణుకా స్వామి హత్య ఫోటోలు బయటికి రావడంతో దర్శన్‌పై సోషల్ మీడియాలో ఫుల్‌ నెగటివిటీ పెరిగింది. ఈ క్రమంలో దర్శన్‌కు సపోర్టు ఇచ్చేందుకు అంతా వెనకాడుతుంటే.. నాగశౌర్య ఆయనకు మద్దతుగా ఒపెన్‌ కామెంట్స్‌ చేసి పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. 



Also Read: ఓటీటీకి వచ్చేస్తోన్న విజయ్‌ సేతుపతి బ్లాక్‌బస్టర్‌ మూవీ 'మహారాజ' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..