Kalki 2898 AD Hindi Collections: యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతోంది. తాజాగా ఈ సినిమా నాలుగో వీకెండ్‌ను పూర్తిచేసుకుంది. అయినా ఇంకా పలు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రీ బుకింగ్స్ నుండి ఇప్పటివరకు ‘కల్కి 2898 ఏడీ’ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా, ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా పలు రికార్డులను తిరగరాసింది. తాజాగా ఈ మూవీ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. హిందీలో డబ్ అయిన సౌత్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది.


హిందీ మార్కెట్..


ఈరోజుల్లో ఎంత ప్యాన్ ఇండియా మూవీ అయినా విడుదలయిన రెండు వారాలకే కలెక్షన్స్ చాలావరకు తగ్గిపోతున్నాయి. కానీ ‘కల్కి 2898 ఏడీ’ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఇప్పటికీ ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. గత మూడు రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’ రూ.17.4 కోట్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. విడుదలయిన 25 రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.600 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ భాషలో కూడా ‘కల్కి 2898 ఏడీ’.. మంచి కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తోంది. ఈ నాలుగు వారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ హిందీ వర్షన్.. రూ.275.9 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం.


టాప్‌లో ‘బాహుబలి 2’..


ఇప్పటికే తన కలెక్షన్స్‌తో హిందీ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సౌత్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ రికార్డ్ సాధించింది. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా.. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్‌ను క్రాస్ చేసినట్టు సమాచారం. త్వరలోనే కేవలం హిందీ మార్కెట్‌లోనే ఈ చిత్రం రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక హిందీ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల విషయానికొస్తే.. టాప్ 1 స్థానంలో ‘బాహుబలి 2’ ఉంది. కేవలం హిందీలోనే ఈ సినిమా రూ.511 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాతి స్థానంలో రూ.435 కోట్ల కలెక్షన్స్‌తో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ నిలిచింది.


‘జవాన్’కు పోటీ..


‘బాహుబలి 2’, ‘కేజీఎఫ్ 2’ తర్వాతి స్థానాన్ని ‘కల్కి 2898 ఏడీ’ సొంతం చేసుకుంది. నాలుగో స్థానంలో రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఈ సినిమా హిందీ మార్కెట్‌లో రూ.272.78 కోట్లను కలెక్ట్  చేసింది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఇప్పటికే ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.616.95 నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’కు రూ.640.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. ‘కల్కి 2898 ఏడీ’ ఆ మూవీని క్రాస్ చేస్తుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‌లో జాయిన్ అయ్యింది.



Also Read: హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?