బాలీవుడ్ టాక్ షోలలో ఒక విధమైన సెన్సేషనల్ క్రియేట్ చేసిన షో - ‘కాఫీ విత్ కరణ్’. అందుకే ఈ షో ఇప్పటికే 7 సీజన్లను పూర్తిచేసుకొని తాజాగా 8వ సీజన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో పాల్గొన్నారు. ఇక తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రాణీ ముఖర్జీ, కాజోల్ కూడా ఈ షోలో కరణ్‌తో ముచ్చటించడానికి వచ్చారు. కరణ్‌తో వీరిద్దరి పరిచయం ఇప్పటిది కాదు. డైరెక్టర్‌గా కరణ్, హీరోయిన్స్‌గా కాజోల్, రాణీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుండే మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అయితే కాజోల్, రాణీ మాత్రం అంత ఈజీగా ఫ్రెండ్స్ అవ్వలేకపోయారు. దీని వెనుక కారణం ఏంటి అని కాఫీ విత్ కరణ్‌లో బయటపెట్టారు ఈ నటీమణులు.
‘కుచ్ కుచ్ హోతా హై’తో దూరం తగ్గలేదు..
రాణీ ముఖర్జీ, కాజోల్.. ఇద్దరికి ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. వీరిద్దరు అక్కాచెల్లెళ్లు కూడా అవుతారు. కానీ వీరి మధ్యలో ఫ్రెండ్‌షిప్ మాత్రం అంత ఘాడంగా ఉండేది కాదట. వీరిద్దరు కలిసి ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాలో కలిసి నటించినా కూడా ఫ్రెండ్స్ అవ్వలేకపోయారట. అదే విషయాన్ని కాఫీ విత్ కరణ్‌లో కరణ్ జోహార్ గుర్తుచేశాడు. ‘‘మీరిప్పుడు చూస్తే చాలా క్లోజ్‌గా ఉన్నారు. కానీ ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య అంతగా ఫ్రెండ్‌షిప్ ఏం లేదు కదా’’ అని అడిగాడు. అది నిజమే అన్నట్టుగా కాజోల్ సమాధానమిచ్చింది. ‘‘అప్పట్లో మిమ్మల్ని చూసి అసలు ఏ కుటుంబ సభ్యులు అయినా ఇలా మాట్లాడుకోకుండా ఉంటారా. పైగా మీరు కజిన్స్ అని ఆశ్చర్యపోయేవాడిని’’ అని అన్నాడు కరణ్. ‘‘అది సహజంగా వచ్చిన దూరమేనా లేదా ఫ్యామిలీ పరంగా మీరంతా క్లోజ్ కాదా’’ అని ప్రశ్నించాడు.
అబ్బాయిలతోనే క్లోజ్..
అది సహజంగా ఏర్పడిన దూరమే అని కాజోల్ సమాధానమిచ్చింది. ‘‘వృత్తిపరంగా ఒకరినొకరం గౌరవించుకునేవాళ్లం’’ అని సింపుల్‌గా సమాధానమిచ్చింది. ‘‘తనతో కలిసి పనిచేస్తున్నప్పుడు నువ్వు కూడా ఈ దూరాన్ని ఫీల్ అయ్యావా’’ అని కాజోల్‌ను ఉద్దేశిస్తూ రాణీని ప్రశ్నించాడు కరణ్. ‘‘అవును. నేను తనను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కాజోల్ అక్కగానే తను నాకు తెలుసు. పెరుగుతున్నకొద్దీ మనుషుల మధ్య కూడా దూరం పెరుగుతుంది. దానికి కారణం ఏంటో కూడా తెలియదు. అదే కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది. మేము అంత ఎక్కువగా కలిసేవాళ్లం కాదు. కాజోల్ అక్క టౌన్‌లో ఉండేది. మేము జుహూలో ఉండేవాళ్లం. నేను, తనీషా చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఇప్పటికీ ఉన్నాం. కాజోల్ అక్క మాత్రం ఫ్యామిలీలో అబ్బాయిలతో ఎక్కువ క్లోజ్‌గా ఉండేది’’ అంటూ తన వెర్షన్‌ను వినిపించింది రాణీ ముఖర్జీ.
మళ్లీ ఎలా కలిసారంటే..
అయితే కలిసి సినిమా చేసినా కూడా కలవని ఈ అక్కాచెల్లెళ్లు.. ఇప్పుడెలా కలిసారని కరణ్ ఆశ్చర్యపోయాడు. అయితే కాజోల్ తండ్రి, రాణీ ముఖర్జీ తండ్రి.. ఇద్దరూ చనిపోయిన తర్వాత వారు ఆటోమేటిక్‌గా క్లోజ్‌గా అయ్యారని రాణీ బయటపెట్టింది. అవును, అది నేచురల్‌గా జరిగిపోయింది అని కాజోల్ కూడా ఒప్పుకుంది. ‘‘కుటుంబంలో మనం ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడే మిగతా కుటుంబం అంతా దగ్గరవుతుంది. నేను కాజోల్ తండ్రికి చాలా క్లోజ్‌గా ఉండేదాన్ని’’ అని బయపెట్టింది రాణీ.
Also Read: నయన తారకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త విఘ్నేష్ - మీరంటే డబ్బున్నోళ్లు బ్రో!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply