Sandeep Vanga: మహిళను హింసించడం భావోద్వేగమా? ‘యానిమల్‘ దర్శకుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Sandeep Vanga: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోయిన్ల చిత్రీకరణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా స్త్రీల గురించి ఆయన చేసిన కామెంట్స్ పైనా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

Sandeep Vanga Justifies Violence Against Females: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్‘. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. అయితే, ఈ ట్రైలర్ లో రష్మిక మందన్నను రణబీర్ హింసిస్తున్నట్లు చూపించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సందీప్ సినిమాలు మహిళలపై హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ చాలా మంది తప్పుబడుతున్నారు. ‘అర్జున్ రెడ్డి‘, ‘కబీర్ సింగ్‘, ‘యానిమల్‘ సినిమాల్లో మహిళలపై హింసను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.

Continues below advertisement

సందీప్ సినిమాలపై గృహ హింస విమర్శలు

విజయ్ దేవరకొండ కెరీర్ కు బాగా బూస్టింగ్ ఇచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ చిత్రమనే చెప్పాలి. అయితే, ఈ మూవీలో  కొన్ని సన్నివేశాలు మహిళలపై హింస రేకెత్తించేలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించాడు సందీప్ రెడ్డి. అక్కడ కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అక్కడ కూడా మహిళపై హింస విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. 

విమర్శలపై స్పందించిన సందీప్ రెడ్డి

ఈ విమర్శలపై సందీప్ రెడ్డి తాజాగా స్పందించారు. తన సినిమాల పట్ల పురుషాధిపత్యం, మహిళలను అణగదొక్కటం లాంటి విమర్శలు చాలా వచ్చాయని చెప్పారు. అయితే, మహిళలను తక్కువ చేసి చూపించటం తన ఉద్దేశం కాదన్నారు. సినిమాల్లో తన వ్యక్తిగత ఇష్ట ఇష్టాలకు చోటు లేదన్నారు. ఎవ్వరినీ కించపరచటానికి తాను సినిమాలు తీయనన్నారు. కథకు అనుగుణంగానే హీరో, హీరోయిన్ల చిత్రీకరణ ఉంటుందన్నారు. ‘అర్జున్‌రెడ్డి’ విషయంలో తాను  తప్పు చేశానని భావించడం లేదన్నారు.

సందీప్ పాత వీడియో వైరల్

అటు ‘యానిమల్’ సినిమా విడుదల నేపథ్యంలో ఆయన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో మహిళలపై హింసను భావోద్వేగం అని చెప్పడం విమర్శలకు తావు ఇస్తోంది. “మీరు స్త్రీని చెంపదెబ్బ కొట్టలేకపోతే, మీకు కావలసిన చోట తాకలేకపోతే, మీరు ముద్దు పెట్టుకోలేరు. అలాంటప్పుడు అక్కడ నేను భావోద్వేగాలను చూడలేను” అని ఆ వీడియోలో చెప్పారు.

సందీప్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం   

మహిళలపై హింసను పెంచేలా ఉన్న సందీప్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అతడిలో భావోద్వేగాలను చూడాలంటే ఎవరైనా తనను చెంపదెబ్బ కొట్టాలి" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “గృహ హింసను ప్రేమగా సమర్థించడం ఏంటి?” అని మరొకరు వ్యాఖ్యానించారు.   

డిసెంబర్ 1న ‘యానిమల్’ విడుదల

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read Also: ‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

Continues below advertisement