కాజల్ అగర్వాల్ కొన్ని నెలలుగా ముంబై నుంచి బయటకు అడుగు పెట్టలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 19న నీల్ కిచ్లూ (Neil Kitchlu)కు ఆమె జన్మనిచ్చారు. డెలివరీకి ముందు నుంచి ముంబై వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. డెలివరీ తర్వాత తల్లి బాధ్యతల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు కాస్త తీరిక చేసుకుని... ఆయనతో, అబ్బాయ్‌తో కలిసి టూర్ వేశారు.
 
ఇప్పుడు కాజల్ అగర్వాల్ గోవాలో ఉన్నారు (Kajal Aggarwal Goa Vacation). భర్త గౌతమ్ కిచ్లూ, కుమారుడు నీల్ కిచ్లూతో పాటు సోదరి నిషా అగర్వాల్ ఫ్యామిలీతో కలిసి టూర్ వేశారు. అన్నట్టు... కాజల్ అగర్వాల్ కుమారుడు నీల్ కిచ్లూకి ఫస్ట్ హాలిడే టూర్ ఇది. గోవా బీచ్‌లో చిన్నారి కాళ్ళు పెట్టిన ఫోటోను కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గోవా టూర్ వీడియో కూడా షేర్ చేశారు.


Also Read: సమ్మెకి దిగనున్న నిర్మాతలు - షూటింగులు బంద్?


సినిమాలకు వస్తే... 'హే సినామికా'తో ఈ ఏడాది మార్చిలో కాజల్ అగర్వాల్ థియేటర్లలో సందడి చేశారు. 'ఆచార్య'లో ఆమె క్యారెక్టర్ తొలగించడం కూడా చర్చనీయాంశం అయ్యింది. హిందీ సినిమా 'ఉమ' షూటింగ్ కంప్లీట్ చేశారు కాజల్. మరో రెండు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే... బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ ఏ సినిమాకు సంతకం చేశారనేది ఆసక్తిగా మారింది.


Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!