Kiran Abbavaram Birthday: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే (జూలై 15) ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ ఫిల్మ్ 'క' (KA Movie) టీజర్ విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌కు సైతం గూస్ బంప్స్ తెప్పించేలా ఆ టీజర్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒక్కసారి ఆ టీజర్ ఎలా ఉందో చూడండి.


ఉత్తరాల నుంచి హత్యల వరకు!
KA Movie Teaser Review: 'ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావ్?' అని వాయిస్ ఓవర్ వస్తుండగా... క్రిష్ణగిరి అనే కొండ ప్రాంతాల్లోకి వెళుతున్న కథానాయకుడు కిరణ్ అబ్బవరాన్ని చూపించారు. అతను ఓ పోస్ట్ మ్యాన్ అని ఆ గెటప్, విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. మరి, సామాన్య పోస్ట్ మ్యాన్ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనేది క్యూరియాసిటీ కలిగించే అంశం. కథానాయకుడికి ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఎందుకు ఉంది? అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.


నాకు తెలిసిన నేను మంచి... తెలియని తోడేలు!
ఉత్తరాలు అందించే పోస్ట్ మ్యాన్ హత్యలు ఎందుకు చేశాడు? అనేది కథలో కీలక అంశం అయితే... కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ మరొక ఇంట్రెస్టింగ్ అంశం. డ్యూయల్ షేడ్ ఉన్న రోల్ ఆయన చేశారని టీజర్ చూస్తే తెలుస్తోంది.


'నీకంటూ ఎవరూ లేరా? హత్యలు చేసే వరకు వెళ్ళావ్! అసలు నువ్వేంట్రా?' అని ప్రశ్నిస్తే... 'నాకు తెలిసిన నేను మంచి' అని కిరణ్ అబ్బవరం ఆన్సర్ ఇచ్చారు. 'నాకు తెలియని నేను...' అని పాజ్ ఇవ్వగా... 'తోడేలువి రా నువ్వు' అని మరొక ముసుగు మనిషి సమాధానం ఇచ్చారు. అతడు ఎవరు? అనేది సినిమాలో చూడాలి. 


కిరణ్ అబ్బవరం డ్యూయల్ షేడ్ రోల్, ఆ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఆ రెండిటికి తోడు విజువల్స్ బావున్నాయి. చూస్తుంటే... కిరణ్ అబ్బవరానికి 'కాంతార' రేంజ్ సక్సెస్ ఇచ్చేలా కనబడుతోంది. ఆ రూరల్ సెటప్, ఆ విజువల్స్ అంత బావున్నాయి. నేపథ్య సంగీతం సైతం బావుంది.


Also Read: పీవీఆర్ పంజాగుట్టలో ప్రేక్షకులకు షాక్... థియేటర్‌లో వర్షం... కల్కి 2898 ఏడీ షో క్యాన్సిల్






'క' చిత్రానికి ఇద్దరు దర్శకులు... ఇంకా క్రూ ఎవరంటే?
Ka Movie Cast And Crew: 'క' చిత్రాన్ని శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద చింతా గోపాలకృష్ణ రెడ్డి ఉన్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి ఇద్దరు దర్శకులు. సుజీత్, సందీప్ దర్శక ద్వయం ఈ గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమా ఆడియో హక్కుల్ని ప్రముఖ ఆడియో లేబుల్ సారెగమ తీసుకుంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీత దర్శకుడు.


Also Read25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్ - మిస్టర్ బచ్చన్ సాంగ్ ట్రోలర్‌కు ఇచ్చి పారేసిన హరీష్ శంకర్



'క' చిత్రీకరణ పూర్తి అయ్యిందని నిర్మాత తెలిపారు. పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ చిత్రాన్ని తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: శ్రీ  వరప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల, ఛాయాగ్రహణం: విశ్వాస్ డానియేల్ - సతీష్ రెడ్డి మాసం, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థ: శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సహ నిర్మాతలు: చింతా వినీషా రెడ్డి - చింతా రాజశేఖర్ రెడ్డి,సీఈవో (క ప్రొడక్షన్స్): రహస్య గోరఖ్, నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి, దర్శకత్వం: సుజీత్ - సందీప్.