జ్యోతి పూర్వాజ్ (Jyothi Poorvaj)... సారీ సారీ జయశ్రీ రై కేకే... సారీ సారీ సారీ ఈ రెండు పేర్లు కంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు 'జగతి మేడమ్' అని చెబితే ఠక్కున గుర్తుకు వస్తుంది. 'గుప్పెడంత మనసు' ఎఫెక్ట్ అంత ఉంది మరి! ఆ సీరియల్‌కు ఎండ్ కార్డు పడింది. కానీ, జగతి మేడమ్ అలియాస్ జ్యోతి పూర్వాజ్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు సీరియళ్లతో కాకుండా సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ రెడీ అయ్యింది.

Continues below advertisement


భర్త దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్!
దర్శకుడు సుక్కు పూర్వాజ్ (Director Poorvaaj), జ్యోతి పూర్వాజ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆవిడతో పెళ్లికి ముందు నుంచి ఆయన దర్శకత్వంలో కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తున్నారు. 'శుక్ర', 'మాటరాని మౌనమిది', 'ఏ మాస్టర్ పీస్' వంటి క్రిటికల్ ఎక్లెయిమ్డ్ సినిమాలు ఆయన తీశారు. ఆ మూడు సినిమాల్లో 'ఏ మాస్టర్ పీస్'లో జ్యోతి పూర్వాజ్ నటించారు. ఇప్పుడు భార్య భర్తలు కలిసి కొత్త సినిమా అనౌన్స్ చేశారు.


Jyothi Poorvaj New Movie: జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న తాజా సినిమాకు 'కిల్లర్' టైటిల్ ఖరారు చేశారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని అనౌన్స్ చేశారు. 'కిల్లర్' ఫ్రాంచైజీలో ఇది తొలి సినిమా అని, ఈ సినిమాకు 'కిల్లర్ పార్ట్ 1 - డ్రీమ్ గర్ల్' అని టైటిల్ పెట్టారు.  






పవర్ ఫుల్ లేడీ... గన్...  చెస్ కాయిన్స్...  ఆల్ట్రా మోడరన్ వేలో డిజైన్ చేసిన ఈ 'కిల్లర్' గ్రాఫిక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా సంస్థపై పూర్వాజ్, ప్రజయ్ కామత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఇద్దరు నిర్మాతలు కలిసి చేస్తున్న రెండో చిత్రమిది. ఈ చిత్రానికి పూర్వాజ్ దర్శకత్వం వహిస్తుండడంతో పాటు ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని పూర్వాజ్ తెలిపారు.


Also Read: ముద్దులతో రష్మీ గౌతమ్ ఫోటో షూట్... ఏజ్ అంతా వేస్ట్ చేస్తుందా? ఆంటీలకు అంకుల్స్ ఫాలోయింగ్ ఎక్కువా?



Killer Part 1: Dream Girl Movie Cast And Crew: జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఛాయాగ్రహణం: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీత దర్శకులు: అషీర్ ల్యూక్ - సుమన్ జీవరత్నం, వీఎఫ్ఎక్స్ - వర్చువల్ ప్రొడక్షన్: మెర్జ్ ఎక్స్ ఆర్, నిర్మాణ సంస్థలు: థింక్ సినిమా - మెర్జ్ ఎక్స్ ఆర్, నిర్మాతలు: పూర్వాజ్ - ప్రజయ్ కామత్, రచన - దర్శకత్వం: పూర్వాజ్.


Also Read: మెగా హీరో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కటౌట్... 'మట్కా' టీజర్‌లో ఆ షాట్ గమనించారా?