Gali Janardhan Reddy's son Kireeti starrer Junior premiere show talk reactions: ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'జూనియర్'. శ్రీ లీల హీరోయిన్. జెనీలియా కీలక పాత్ర చేశారు. కన్నడ స్టార్ రవిచంద్రన్, రావు రమేష్ తదితరులు నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ జూలై 18న (శుక్రవారం). ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోస్ పూర్తి అయ్యాయి. మరి టాక్ ఎలా ఉందో చూశారా?


కిరీటి డ్యాన్సులకు మంచి మార్కులు!
'జూనియర్' ప్రీమియర్ షోస్ చూసిన జనాలు అందరూ చెప్పే మాటలో కామన్ పాయింట్ ఒక్కటే... కిరీటి డ్యాన్సులు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టమని సినిమా విడుదలకు ముందు కిరీటి చెప్పారు. డ్యాన్సుల్లో తన ఫేవరెట్ హీరో స్టైల్ ఫాలో అయ్యారు కిరీటి. యాక్షన్ సీక్వెన్సులు కూడా బాగా చేశారని పేరు వచ్చింది. నటుడిగా, హీరోగా ఆయనకు మంచి డెబ్యూ అని టాక్ వచ్చింది.


Also Read: శ్రీ లీలను 'జూనియర్' గట్టెక్కిస్తుందా? ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఆవిడకు ఎందుకు అంత ఇంపార్టెంట్??






సినిమాకు మిక్స్డ్ టాక్... ఏవరేజ్ మార్కులే?
కిరీటి రెడ్డి డ్యాన్సులకు మంచి మార్కులు పడ్డాయి కానీ సినిమాకు మాత్రం సూపర్ హిట్, యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. కమర్షియల్ టెంప్లేట్, రొటీన్ ఫార్ములా కథతో సాగే సినిమా అని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. 


'జూనియర్' ఫస్టాఫ్ కమర్షియల్ అయితే సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగిందట. ఎన్నో సినిమాల్లో చూసిన సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ తెరపై వచ్చినట్టు ఉన్నాయని కొందరు విమర్శలు చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్ వీక్ అని కూడా టాక్ వచ్చింది.


Also Read: నదివే వర్సెస్ నీవే... అదే మ్యూజిక్కు - అవే స్టెప్పులు... రష్మిక కొత్త సినిమాలో పాట కాపీయేనా!?






రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటల్లో 'వైరల్ వయ్యారి' కొన్నాళ్లు వినిపించడం గ్యారెంటీ. ఆల్రెడీ విడుదలైన లిరికల్ వీడియోలో స్టెప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కిరీటి, శ్రీ లీల పెయిర్ డ్యాన్స్ బాగా చేయడం కూడా కలిసి వచ్చింది. సినిమా చూసిన జనాలు కిరీటి గురించి మాట్లాడుతున్నారు తప్ప హిట్ అని మాత్రం అనడం లేదు. సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? ట్విట్టర్‌లో ఎవరెవరు ఎలా వేశారు? అనేది ఒక్కసారి చూడండి.