నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend Movie). అందులో మొదటి పాట 'నదివే' (Nadhive Music Video) విడుదల చేశారు. సాధారణంగా విడుదల చేసే లిరికల్ వీడియోలకు భిన్నంగా ఒక ప్రమోషనల్ సాంగ్ పిక్చరైజ్ చేశారు. ఆ సాంగ్ ట్యూన్, అందులో స్టెప్పులు కాపీ అని విమర్శలు వస్తున్నాయి.
నీవే ఒరిజినల్ అయితే నదివే కాపీ!?రష్మికా మందన్నా నటించిన సినిమా కావడంతో 'నదివే...' పాటను ఎక్కువ మంది చూశారు. తెలుగు పాటను విడుదలైన 24 గంటల్లో 33 లక్షల మంది చూశారు. ఈ సాంగ్ విన్న, చూసిన జనాలకు ముందుగా గుర్తుకు వచ్చిన పాట 'నీవే'.
'నీవే...' పాటలో కనిపించిన అమ్మాయి, అబ్బాయి ఎవరో మెజారిటీ ప్రేక్షకులకు తెలియదు. ఆ సంగీత దర్శకుడి పేరు ఎంత మందికి గుర్తు ఉందో తెలియదు. అయితే ఒక్కసారైనా యూట్యూబ్‌లో సాంగ్ వినే ఉంటారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందించిన 'నీవే' పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసింది. అటువంటి హిట్ సాంగ్ స్ఫూర్తితో (అంటే యాజిటీజ్ కాపీ చేయలేదు) 'ది గర్ల్ ఫ్రెండ్' కోసం 'నదివే' సాంగ్ చేశారు. ట్యూన్ వింటే, స్టెప్స్ చూస్తే... సేమ్ టు సేమ్ అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఆ రెండు పాటలూ చూడండి.
Also Read: పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా... వంద సినిమాలతో సమానం - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
రాహుల్ రవీంద్రన్... హేషామ్... తప్పు ఎవరిది?మలయాళ హిట్ 'హృదయం' సినిమాకు సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన పాటలకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ దేవరకొండ 'ఖుషి', నాని 'హాయ్ నాన్న'కు ఆయన ఇచ్చిన పాటలు బావుంటాయి. అటువంటి సంగీత దర్శకుడు వేరొక పాట స్ఫూర్తితో 'నదివే' చేయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సంగీతం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి 'ది గర్ల్ ఫ్రెండ్' దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన భార్య చిన్మయి పాపులర్ సింగర్. కాపీ, ఇన్స్పిరేషన్ ఆయనకు తెలియకుండా జరిగింది? ఈ పాట విషయంలో తప్పు ఎవరిది? అనేది ప్రశ్నగా మారింది.
'నీవే' పాటకు మాత్రమే కాదు... తెలుగులో కొన్ని సినిమాలకు సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ పని చేశారు. ఆయన బాణీల్లో మెలోడీ బావుంటుంది. ఆయనకు కొంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటువంటి ఇన్స్పిరేషన్ సాంగ్ హేషామ్‌తో చేయించుకునే బదులు అటువంటి యువ సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇస్తే బావుంటుందనేది నెటిజనుల అభిప్రాయం.