అమెరికాలోని కాలిఫోర్నియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr Fans Meet) అభిమానులు ఓ సమావేశం నిర్వహించారు. ఆస్కార్ అవార్డ్స్ (Oscars 2023) ప్రోగ్రామ్ ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఇండియన్ టైమింగ్ ప్రకారం 13వ తేదీ ఉదయం అన్నమాట. ఆస్కార్స్ కోసం అమెరికా వెళ్ళిన ఎన్టీఆర్, ఫ్యాన్స్ కొందరిని కలిశారు. 


నా గుండెల్లో అంత కంటే ప్రేమ దాగుంది - ఎన్టీఆర్
కాలిఫోర్నియాలోని అభిమానుల సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ (NTR Jr) చాలా ఎమోషనల్ అయ్యారు. 'ఆర్ఆర్ఆర్' (RRR Movie)ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అభిమానులకు థాంక్స్ చెప్పారు. ''మీరు చూపించే అభిమానానికి నా మనసులో మాట చెప్పడానికి తెలుగులో పెద్ద పదం కనిపించడం లేదు. ఒక పదం ఏంటంటే... మీరు నాకు ఎంత ప్రేమ చూపిస్తున్నారో... అంత కంటే ప్రేమ లోపల (గుండెల్లో) దాగి ఉంది. నేను చూపించలేకపోతున్నాను. లెక్క ప్రకారం అయితే... నేను కింద కూర్చోవాలి. అభిమానులు అందరూ పైన ఉండాలి'' అని ఎన్టీఆర్ మాట్లాడారు. 


మనది రక్త సంబంధం కంటే చాలా పెద్ద బంధం! - ఎన్టీఆర్
''నేను ఏం చేసి మీకు ఇంత దగ్గర అయ్యానో నాకూ తెలియదు. మనది రక్త సంబంధం కంటే చాలా పెద్ద బంధం'' అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. 'మీరు మా బ్రదర్ అన్నయ్యా' అని ఓ అభిమాని అంటే... ''మీరు అందరూ నా బ్రదర్స్'' అని ఎన్టీఆర్ బదులు ఇచ్చారు. అభిమానులు అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నానని ఆయన అన్నారు. ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాని భావోద్వేగానికి లోనయ్యారు ఎన్టీఆర్.


Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?



ఆస్కార్స్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ పెర్ఫార్మన్స్!
అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ (Ram Charan), కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ (NT Rama Rao Jr)... ఈ ఇద్దరూ లేకుండా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాను ఊహించుకోలేం!  రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు వాళ్ళిద్దరి నటన తోడు కావడంతో సినిమా రికార్డులు తిరగ రాసింది. సినిమాలో వాళ్ళిద్దరి యాక్టింగ్ ఒక హైలైట్ అయితే, 'నాటు నాటు...'లో చేసిన డ్యాన్స్ మరో హైలైట్! ఈ పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. ఆస్కార్స్ లైవ్ షోలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. అంతకు మించి? అనేలా ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చేయనున్నారు. నందమూరి తారక రత్న మరణం కారణంగా ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా అమెరికా వెళ్లారు. 


Also Read : రొయ్యల చెరువులో రొమాంటిక్ గీతం - వెన్నెల్లో కార్తికేయ, నేహా శెట్టి


ఆస్కార్స్ అవార్డుల వేడుక ముగిసిన రెండు మూడు రోజుల తర్వాత ఎన్టీఆర్ ఇండియా రిటర్న్ అవుతారని సమాచారం. ఆయన వచ్చిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. నిజం చెప్పాలి అంటే... ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఆ సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు. తారక రత్న మరణంతో ఆ ప్రోగ్రామ్ కూడా వాయిదా వేశారు. సినిమా మాత్రం అనుకున్న సమయానికి సెట్స్ మీదకు వెళుతుందట. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక అని అధికారికంగా వెల్లడించారు. దీనికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు వర్క్ చేయనున్నారు. అమెరికాలో అక్కడి ఫైట్ మాస్టర్లతో కూడా ఎన్టీఆర్ డిస్కషన్స్ చేయనున్నారు.