''వెన్నెల్లో ఆడపిల్ల...
కవ్వించే కన్నెపిల్ల...
కోపంగా చూస్తే ఎల్లా...
క్షణంలో అగ్గిపుల్ల...''
అంటూ నేహా శెట్టి (Neha Shetty) అందాన్ని, వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ కార్తికేయ (Kartikeya Gummakonda) పాట పాడుతున్నారు. నేహా శెట్టిని అంటే నేహా శెట్టిని కాదు లెండి... సినిమాలో ఆమె పాత్రను!


'ఆర్ఎక్స్ 100' కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012' (Bedurulanka 2012 Movie). లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మిస్తున్నారు. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. ఈ చిత్రంతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'వెన్నెల్లో ఆడపిల్ల...' అంటూ సాగే గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు.


Also Read 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా? 
 


మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీ అందించిన 'వెన్నెల్లో ఆడపిల్ల...' (Vennello Adapilla Song) గీతానికి యంగ్ లిరిసిస్ట్ కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, జెవి సుధాంశు ఆలపించారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... కార్తికేయ, నేహా శెట్టిల కెమిస్ట్రీ అందంగా ఉంది. పాటలో ప్రేమికుల మధ్య రొమాంటిక్ మూమెంట్స్, ఫీలింగ్స్ చక్కగా ఆవిష్కరించారు.   


ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువులో...
పాటకు లభిస్తున్న స్పందన పట్ల చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "ప్రేమకథలోని కీలకమైన సందర్భంలో ఈ 'వెన్నెల్లో ఆడపిల్ల...' పాట వస్తుంది. మణిశర్మ గారి బాణీకి తోడు కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్ హైలైట్ అవుతాయి. ఈ పాటను గోదావరి గ్రామంలోని ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువు మధ్య రాత్రి వేళల్లో చిత్రీకరించాం. సినిమాలో హీరో హీరోయిన్ల జోడి చాలా కొత్తగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ సినిమాకు హైలైట్. అలాగే, కామెడీ కూడా'' అని చెప్పారు. 


రూరల్ డ్రామాల్లో బెంచ్ మార్క్!
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా 'బెదురులంక 2012' అని బెన్నీ ముప్పానేని తెలిపారు. ఇప్పటి వరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఈ సినిమా ఉంటుందని, గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' అనేలా ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్ అని గర్వంగా చెబుతామని బెన్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని, బిజినెస్ క్రేజీగా జరుగుతోందని బన్నీ ముప్పానేని వివరించారు.


Also Read : వెంకటేష్ మహా రాజేసిన రగడ - 'కెజియఫ్' ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన మిగతా ముగ్గురు


అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.