Janhvi Kapoor About Her Movies Selection: ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ యంగ్ నటీమణుల్లో జాన్వీ కపూర్ కూడా ఒకరు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తూ ఏడాదికి కనీసం మూడు చిత్రాలను విడుదల చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ అతిలోక సుందరి వారసురాలు. ఇప్పటికే ఈ ఏడాది ‘మిస్టర్ అండ్ మిసేస్ మహీ’తో అలరించిన జాన్వీ.. ఇప్పుడు ‘ఉలఝ్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. తన అప్‌కమింగ్ మూవీ ‘ఉలఝ్’.. ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన కెరీర్ గురించి, తను చేస్తున్న సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ కపూర్.
అలాంటివి ఎంచుకోను..
తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను చాలా ఈజీ జర్నీని ఎంచుకొని ఉండవచ్చు. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు కాకుండా ఒక పెద్ద కమర్షియల్ సినిమా చేసుండొచ్చు. అందులో ఒక గ్లామర్ రోల్ చేసుంటే ఈజీగా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేది. చాలా పాపులారిటీ లభించేది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగుండేవి’’ అంటూ తను ఇప్పటివరకు ఎంచుకున్న సినిమాలపై వ్యాఖ్యలు చేసింది జాన్వీ కపూర్. ‘దడక్’ అనే మూవీతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ తనకు ఎక్కువ రీచ్ రావాలి అనుకొని ఉండుంటే కమర్షియల్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చేదాన్ని అని తెలిపింది జాన్వీ.
తృప్తిగా ఉంది..
‘‘నేను కష్టమైన ఆట ఆడుతున్నానని తెలుసు. నా సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను చూసుకుంటే హిట్లు కంటే మిస్‌లే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేను ఎంచుకునే సినిమా కథలు అలాంటివి. కానీ దీనివల్ల ఆర్టిస్ట్‌గా ఎదుగుదల నాకు చాలా తృప్తినిస్తుంది. ఈజీ మార్గాన్ని ఎంచుకునే ఉండుంటే ఈ తృప్తి వచ్చేది కాదు’’ అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ఇక తన మొదటి సినిమా దగ్గర నుండి ఇప్పటివరకు జాన్వీ కపూర్ నటించిన కమర్షియల్ సినిమాల సంఖ్య చాలా తక్కువే. ఒక్కొక్క సినిమాను ఒక్కొక్క జోనర్‌లో చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ భామ. హీరోయిన్‌గా పరిచయం అయినప్పుడు నెపో కిడ్ అని తనపై చాలా నెగిటివిటీ ఉన్నా సినిమా సినిమాకు తన యాక్టింగ్‌ను మెరుగుపరుస్తూ వెళ్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.
లేడీ స్పై..
ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆగస్ట్ 2న తను నటించిన లేడీ స్పై చిత్రం ‘ఉలఝ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సుధాన్షు సాహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో స్పై ఏజెంట్ సుహానా భాటియాగా జాన్వీ నటన అందరినీ ఆకట్టుకోనుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఏడాదిలోనే తన తెలుగు డెబ్యూకు కూడా సిద్ధమయ్యింది జాన్వీ కపూర్. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో మూవీలో కూడా తనే హీరోయిన్‌గా ఎంపికయ్యింది.
Also Read: సాయం లేకుండా వాష్‌రూమ్‌కు వెళ్లలేకపోయా, పక్షవాతం అనుకుని భయపడ్డా! - జాన్వీ కపూర్