Devara Actress Janhvi Kapoor About Her Health Condition: చాలావరకు సినీ సెలబ్రిటీలు తమ వర్క్ కోసం ఒక దేశం నుండి మరో దేశానికి ప్రయాణిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారు డైట్ మెయింటేయిన్ చేస్తూ సరిగా రెస్ట్ లేకపోవడం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఎక్కువశాతం వారి ఆరోగ్య సమస్యల గురించి బయటపెట్టరు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా అదే పరిస్థితి ఎదుర్కుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల జాన్వీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయాన్ని తన తండ్రి బోనీ కపూర్ స్వయంగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం పూర్తిగా కోలుకొని వర్క్‌పై ఫోకస్ పెట్టిన ఈ భామ.. తన ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. 


జంక్ ఫుడ్..


ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత రెండురోజులకే డిశ్చార్జ్ అయ్యింది. తాజాగా దీని గురించి తను ఫ్యాన్స్‌లో పంచుకుంది. గత కొంతకాలంగా తను వరుసగా షూటింగ్స్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. షూటింగ్ ఒకచోట అయితే ప్రమోషన్స్ మరోచోట చేయాల్సి వచ్చింది కాబట్టి వరుసగా ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా ప్రయాణాలు చేయడం వల్లే తాను వీక్ అయ్యానని బయటపెట్టింది. ఒక పాట షూటింగ్ కోసం తాను చెన్నై వెళ్లానని, అక్కడికి వెళ్లినప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులో నొప్పి మొదలయ్యిందని తెలిపింది జాన్వీ కపూర్.


భరించలేని నొప్పి..


బయట తినడం వల్ల మొదట కడుపులో నొప్పిగా అనిపించినా మెల్లగా దాని వల్ల నీరసం కూడా వచ్చిందని చెప్పింది జాన్వీ కపూర్. భరించలేనంత నొప్పి, వణుకు రావడంతో అసలు తనకు ఏమైందో అని భయపడిపోయిందట. చెన్నై నుండి హైదరాబాద్‌కు ఫ్లైట్ ఎక్కే ముందు తన పరిస్థితి చూసి పక్షవాతం వచ్చిందేమో అని సందేహపడ్డానని చెప్పుకొచ్చింది జాన్వీ. అసలు సాయం లేకుండా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేకపోయానని షాకింగ్ విషయం బయటపెట్టింది. అసలు నడవడానికి కూడా ఓపిక లేకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుందట. మూడు రోజులు అక్కడ చికిత్స తీసుకున్నానని అసలు విషయాన్ని వివరించింది జాన్వీ కపూర్.


ఆరోగ్యమే ముఖ్యం..


మనం అన్నింటికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పింది జాన్వీ. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్ చేయగలనో లేదో అని భయంలోనే ఉందట. ఇప్పుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వర్క్‌లో బిజీ అవుతున్నా కూడా పూర్తిగా ఓపిక లేదని బయటపెట్టింది జాన్వీ కపూర్. దీంతో తను త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఆగస్ట్ 2న తను నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఉలఝ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’తో తెలుగులో డెబ్యూకు సిద్ధమయ్యింది జాన్వీ కపూర్.



Also Read: ‘తంగలాన్’ వల్ల ఐదుగురు డాక్టర్లను కలిశాను... ఒళ్లంతా మంట - మాళవికా మోహనన్