Janhvi Kapoor Reacts To Wedding Rumours: జాన్వీ కపూర్.. అందాల నటి శ్రీదేవి పెద్ద కూతురు. అందం, అభినయంలో శ్రీదేవికి ఎక్కడ తగ్గదు జాన్వీ. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక ఈ మధ్యే ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురించి కూడా బయటపెట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త శిఖర్ పహరియాతో ప్రేమలో ఉన్నట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వార్తపై జాన్వీ కపూర్ సైతం స్పందించింది.
పెళ్లి అక్కడే..
ప్రముఖ వ్యాపారవేత్త శిఖర్ పహరియాతో తాను ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టింది జాన్వీ కపూర్. ఇద్దరు కలిసి తిరిగిన ఫొటోలు, లంచ్, డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు కూడా చాలానే బయటికి వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక ఫొటో గ్రాఫర్ జాన్వీ కపూర్ ఫొటోలు షేర్ చేసి నేను తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. బంగారు రంగు చీర కట్టుకుని అని ఆమె గతంలో చెప్పిన విషయాన్ని పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్ట్ కి జాన్వీ కపూర్ కామెంట్ పెట్టారు. కుచ్ బీ (ఏదైనా కావొచ్చు) అని ఆమె పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
ఇక జాన్వీ కపూర్ పెట్టిన కామెంట్ పై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఒక ఫొటో గ్రాఫర్ కి నీ పెళ్లి ఎక్కడ చేసుకోవాలో తెలుసు నీకు తెలీదా? అని కామెంట్ చేశారు. ఆమె పెళ్లి ప్లాన్లు ఆమెకె తెలీదా అని కొంతమంది అంటుంటు.. చాలామంది ఆ కామెంట్ కి లాఫింగ్ ఎమోజీతో రియాక్ట్ అవుతున్నారు.
2021లో చేసిన కామెంట్..
అయితే జాన్వీ కపూర్ ఈ కామెంట్ 2021లోనే చేశారు. అప్పుడు ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఈ విషయాన్ని చెప్పారు. మీ పెళ్లి గురించి మీరు ఎలా ఊహించుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకి ఆమె ఇలా సమాధానం చెప్పుకొచ్చారు. "నాకు ముందు నుంచి నా పెళ్లికి సంబంధించి చాలా క్లారిటీ ఉంది. నేను తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. గోల్డ్ కలర్ జరీ కాంజీవరం చీర కట్టుకుని నేను, నాకు కాబోయే వాడు పట్టుపంచ కట్టుకుంటాడు. పెళ్లి తర్వాత మేమిద్దరం అరిటాకు భోజనం చేస్తాం" అని చెప్పారు జాన్వీ. కాగా.. అప్పుడు ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
శిఖర్ తో రిలేషన్ షిప్..
శిఖర్ తో రిలేషన్ షిప్ గురించి స్వయంగా జాన్వీ కపూర్ బయటపెట్టారు. ఆమె ఎప్పుడు అతని పేరుతో ఉండే లాకెట్ వేసుకుని కనిపిస్తారు. అంతేకాకుండా చాలాసార్లు వాళ్లిద్దరు కలిసి ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఇక కాఫీ విత్ కరన్ జోహార్ 8 లో పాల్గొన్న ఆమె స్పీడ్ డైల్స్ లో నాన్న, చెల్లి నంబర్ తో పాటు శిఖర్ నంబర్ ఉంటుందని చెప్పారు. శిఖర్ ని ఆమె శీఖు అని ముద్దుగా పిలుచుకుంటాను అని చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. రాజ్ కుమార్ రావ్ సరసన నటించిన మిస్టర్ అండ్ మిస్ మహి సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.