పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు నచ్చిన సినిమాలలో 'జల్సా' (Jalsa Movie) ఒకటి.‌ 'ఖుషి' తర్వాత తమ అభిమాన కథానాయకుడి నుంచి సరైన సినిమా రావడం లేదని భావిస్తున్న తరుణంలో... మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'జల్సా' వాళ్ళను మెప్పించింది. బాక్సాఫీస్ దగ్గర విజయం అందించింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమా రీ రిలీజ్ (Jalsa Re Release 2025) అవుతోంది. 

Continues below advertisement


పవన్ పుట్టినరోజు స్పెషల్...
సెప్టెంబర్ 2న స్పెషల్ షోస్!
Pawan Kalyan Birthday: సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 'జల్సా' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్‌ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న స్పెషల్ ప్లాన్ చేసినట్లు గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది.


'జల్సా' సినిమాను ఇప్పటికే ఐదారుసార్లు రీ రిలీజ్ చేశారు. ఎన్నిసార్లు థియేటర్లలోకి ఆ సినిమాను తీసుకు వచ్చినా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది. గతంలో 'ఆరెంజ్' సినిమా రీ రిలీజ్ కలెక్షన్లను జనసేన పార్టీకి విరాళంగా అందించారు. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి.


Also Read: 'కూలీ' సినిమాకు క్లైమాక్స్ కీలకం... రజనీపై భారం వేసిన దర్శకుడు - దుబాయ్ రివ్యూ ఎలా ఉందంటే?


'జల్సా' సినిమా కథ విషయానికి వస్తే... సంజయ్ సాహు అనే ఓ యువకుడు తమ గ్రామంలో పెత్తందారులు, భూస్వాముల అరాచకాలకు విసిగిపోయి అన్నల్లో కలుస్తారు. ఓసారి మంత్రి మీద బాంబు బ్లాస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే అతను అన్నలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తాడు. ఆ తర్వాత అడవిలో తనతో పాటు ప్రయాణించిన పోలీస్ అధికారి కుమార్తెను ప్రేమిస్తాడు. తొలుత పెద్ద కుమార్తెకు లైన్ వేస్తాడు. అయితే ఆమెకు పెళ్లి అవుతుంది. ఆ తర్వాత చిన్న కుమార్తెను ప్రేమిస్తాడు. లవ్ లైఫ్ హ్యాపీగా సాగుతున్న తరుణంలో సంజయ్ సాహు జీవితంలోకి వచ్చిన విలన్ ఎవరు? అతను ఏం చేశాడు? అనేది సినిమా.
 
'జల్సా' సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి.‌ ఈ సినిమాకు ముందు పవన్ హీరోగా 'అతడు' చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నించారు. అయితే కుదరలేదు. ఆ తర్వాత 'జల్సా'తో వాళ్ల కాంబినేషన్ కుదిరింది. అప్పటి నుంచి స్నేహం చిగురించింది. ఇప్పుడు ఆప్త మిత్రులుగా మారారు.


Also Read: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ బ్లాక్ బస్టరే... 'వార్ 2'కు దుబాయ్ నుంచి ఫుల్ పాజిటివ్ రివ్యూ