జుజుబీ, ఈ పదం మీద పేటెంట్ హక్కులు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కి ఇచ్చేయవచ్చు. ప్రేక్షకులు ఎవరికి అయినా సరే... ఆ పదం వింటేముందుగా గుర్తుకు వచ్చేది రజనీయే! సినిమాలో ఆయన చెప్పిన సింగిల్ వర్డ్ అంత పాపులర్ అయ్యింది. ఇప్పుడు మరోసారి 'జుజుబీ' అనడానికి రెడీ అవుతున్నారు రజనీ! అదీ పాటలో!
'జైలర్' సినిమాలో 'జుజుబీ' సాంగ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా, టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా 'జైలర్' (Jailer Movie). నయనతార ప్రధాన పాత్రలో 'కో కో కోకిల', శివ కార్తికేయన్ హీరోగా 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'మాస్టర్' సినిమాలు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రజనీకి 169వ సినిమా. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. ఇప్పుడు మూడో పాట విడుదల కానుంది.
Jujubee Song: 'జుజుబీ' పేరుతో 'జైలర్'లో ఓ పాటను రూపొందించారు. ఆ పాటను బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పేర్కొంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : ధనుష్ పాన్ ఇండియా సినిమాలో అక్కినేని నాగార్జున!
రజనీకాంత్, తమన్నా భాటియా మీద తెరకెక్కించిన 'నువ్వు కావాలయ్యా' సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్ అవుతోంది. అందులో రజనీకాంత్ స్టైల్, స్వాగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తమన్నా డాన్స్ మూమెంట్స్ జనాలకు నచ్చాయి. ముఖ్యంగా హుక్ స్టెప్ అయితే విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఆ హుక్ స్టెప్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అనిరుధ్ ట్యూన్ శ్రోతలను ఆకట్టుకుంది.
ఆగస్టు 10న థియేటర్లలోకి 'జైలర్'
Jailer Movie Release Date : ఆగస్టు 10న 'జైలర్' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే... కేరళ వరకు టైటిల్ కొంచెం మారింది.
కేరళలో దర్శకుడు షకీర్ మదాత్తిల్ 'జైలర్' ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రజని సినిమా టైటిల్ ముందు అనౌన్స్ చేసినప్పటికీ... కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన ముందుగా రిజిస్టర్ చేయించుకున్నారు. అందుకని, మలయాళం వరకు 'ది జైలర్' పేరుతో విడుదల చేయనున్నారు. అదీ సంగతి!
Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'జైలర్'లో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, సునీల్, రమ్య కృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు , రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు ఇతర తారాగణం. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్, కూర్పు : ఆర్. నిర్మల్, కళ : డాక్టర్ కిరణ్, యాక్షన్: స్టన్ శివ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial