టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జాక్' (Jack Movie). తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ 'జాక్' సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాము అంటూ నిర్మాతలు ఒక కొత్త పోస్టర్ ద్వారా 'జాక్' రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 


వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి 'జాక్'
స్టార్ బాయ్ అనే ట్యాగ్ కు తగ్గట్టుగా వరుసగా మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ప్రస్తుతం ఆయన 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీకి 'జాక్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చాలా రోజుల క్రితమే వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న సిద్దు జొన్నలగడ్డ పుట్టిన రోజు సందర్భంగా 'జాక్' టైటిల్, ఇంకా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్లో సిద్దు జొన్నలగడ్డ గన్స్ పట్టుకొని ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. ఇక ఈ 'జాక్' సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ కు జోడిగా 'బేబీ' ఫెమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. అలాగే ఈ మూవీకి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. 


ఈ ఏడాది 'టిల్లు స్క్వేర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న నెక్స్ట్ మూవీ ఇదే కావడంతో, 'జాక్'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 10, 2025న రిలీజ్ చేయబోతున్నామంటూ స్పెషల్ గా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో కూడా ఒక జీప్ తో పాటు గన్ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఏప్రిల్ అంటే సమ్మర్ హాలిడేస్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సిద్ధూ మంచి రిలీజ్ డేట్ ని పట్టేసాడు.


Also Readబెయిల్‌పై బయటకొచ్చిన పవిత్ర గౌడ... ఆ గుడిలో దర్శన్ పేరు మీద ప్రత్యేక పూజలు - జనాల రియాక్షన్ ఏమిటంటే?






'టిల్లు స్క్వేర్'తో 100 కోట్ల క్లబ్ లోకి... 
ఇదిలా ఉండగా సిద్దు జొన్నలగడ్డ గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండడనే చెప్పాలి. 'డీజే టిల్లు'లో సినిమాతో ఆయన క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి. చాలామందికి సిద్దు జొన్నలగడ్డ ఒరిజినల్ పేరుతో కంటే 'డీజే టిల్లు' పేరుతోనే బాగా తెలుసు. ఇక ఈ హీరో అంతకంటే ముందు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. 'డీజె టిల్లు' కంటే ముందు సిద్దు జొన్నలగడ్డ ఎల్బిడబ్ల్యూ, దాగుడుమూత దండాకోర్, మా వింత గాథ వినుమా, గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి సినిమాలు చేశాడు. కానీ 'డీజే టిల్లు' తర్వాత ఆయన ఫేమ్ మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో తన నటన, డైలాగ్ డెలివరీతో స్టార్ బాయ్ అయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ.



అలాగే 'డీజే టిల్లు'తో వచ్చిన సక్సెస్ ని, ఆ మూవీకి సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో కూడా కంటిన్యూ చేశాడు. దీంతో సిద్దుకు యూత్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక 'టిల్లు స్క్వేర్' మూవీతో సిద్దు జొన్నలగడ్డ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మరి 'జాక్' మూవీతో ఆ రికార్డులను బ్రేక్ చేసి మరింత ముందుకు వెళ్తాడేమో చూడాలి.


Read Also : Oscars 2025: ఆస్కార్ 2025 రేసులో ఇండియన్ సినిమా అవుట్... టాప్ 10లో 'లాపతా లేడీస్' లేదు