త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’తో క్లీన్ హిట్‌ను అందుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో తెరకెక్కనున్న మూవీపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం జర్మనీ అడవుల్లో తిరిగేసి వచ్చిన మహేశ్.. బాడీ వర్కవుట్స్‌ను కూడా మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీలో మహేశ్ బాబు కాకుండా నటించే ఇతర యాక్టర్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. మామూలుగా రాజమౌళి సినిమా అంటే ఫారిన్ యాక్టర్స్ కచ్చితంగా ఉంటారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇక మహేశ్ బాబు సినిమాలో నటించే ఫారిన్ నటి గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
ఇండోనేషియన్ నటి..
ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి తాను తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో పలువురు ఫారిన్ యాక్టర్లకు కీలక పాత్రలు ఇచ్చాడు రాజమౌళి. అంతే కాకుండా ఎన్‌టీఆర్ సరసన నటించే హీరోయిన్‌గా కూడా ఫారిన్ నటీమణి ఒలివియా మోర్రీస్‌ను సెలక్ట్ చేశాడు. అదే విధంగా మహేశ్ బాబుతో చేస్తున్న మూవీలో కూడా ఫారిన్ నటీనటులు ఉంటారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఫారిన్ నటీనటులు ఉండే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులపై రూమర్స్ వైరల్ అవ్వగా.. తాజాగా ఈ సినిమాలో ఒక ఇండోనేషియన్ నటి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్..
చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ నటి.. మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన చెల్సియా.. ఇండోనేషియన్ భాషలో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మహేశ్, రాజమౌళి మూవీలో తను కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని చెల్సియా ఫాలో అవ్వడంతో ఇవి రూమర్స్ కాదు.. నిజమే అని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అవ్వడంతో త్వరలోనే ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి సినిమా విశేషాలను పంచుకోనున్నాడట రాజమౌళి.
అందుకే ఫాలో అవుతుందేమో..!
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ లభించింది. అందుకే వరల్డ్ వైడ్ సినీ సెలబ్రిటీల్లో తనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే విధంగా చెల్సియా కూడా ఫాలో అవుతుందేమో అని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబుతో చేస్తున్న సినిమా జోనర్‌ను బయటపెట్టారు రాజమౌళి. ఇది ఒక ప్రపంచాన్ని చుట్టేసే వీరుడి కథ అని ప్రకటించారు. ఇది విన్న ప్రేక్షకులు.. హాలీవుడ్‌లోని ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఈ మూవీ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు మరో మూడేళ్ల పాటు ఈ మూవీతో మహేశ్ బాబు బిజీగా ఉండనున్నాడు. చివరిగా తను నటించిన ‘గుంటూరు కారం’ ఓటీటీలో కూడా విడుదలయ్యి పాజిటివ్ టాక్‌ను అందుకుంది.
Also Read: ‘కల్కి 2898 ఏడీ’ థీమ్ మ్యూజిక్‌ను రివీల్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ - వీడియో వైరల్