Kalki 2898 AD Theme Music: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న చిత్రమే ‘కల్కి 2898 ఏడీ’. ముందుగా ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమయిన ఈ పాన్ ఇండియా చిత్రం.. ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమాలను శాసించేలా సిద్ధమవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ.. మేలో విడుదలకు సిద్ధమవుతోంది. హిందూ మైథాలజీ కథ ఆధారంగా రానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ‘కల్కి 2898 ఏడీ’కు మ్యూజిక్‌ను అందిస్తుండగా.. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను ఒక కాన్సర్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్లే చేశాడు. దానికి ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.


ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ..


ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. గతం, వర్తమానం, భవిష్యత్తు.. ఇలా మూడు టైమ్ లైన్స్‌పై నడుస్తుందని ఇప్పటికే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ మూవీ నుండి కొన్ని పోస్టర్లు, ఒక గ్లింప్స్ మినహా ఇంకా ఏ అప్డేట్‌ను ప్రేక్షకులకు అందించలేదు మేకర్స్. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడం కోసం తాజాగా చెన్నైలో జరిగిన ఆయన కాన్సర్ట్‌లో ‘కల్కి 2898 ఏడీ’కి సంబంధించిన మ్యూజిక్ గ్లింప్స్‌ను ప్లే చేశాడు సంతోష్ నారాయణన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్.. ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ మ్యూజిక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.






భారీ రెస్పాన్స్..


తాజాగా చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సంతోష్ నారాయణన్ ‘నీయే ఒలీ’ కాన్సర్ట్‌ను నిర్వహించారు. దానికి ఎంతోమంది ఫ్యాన్స్ హాజరయ్యారు. ఆ సందర్భంలో ‘కల్కి 2898 ఏడీ’ థీమ్ గ్లింప్స్‌ను 2 నిమిషాల వరకు ప్లే చేశాడు సంతోష్. దీనికి ఆడియన్స్ దగ్గర నుండి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘కల్కి’ విజువల్స్‌తో స్టేడియం అంతా దద్దరిల్లింది. ముందుగా ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ అందించే మ్యూజిక్‌పై ఆడియన్స్‌లో పెద్దగా అంచనాలు లేవు. కానీ కాన్సర్ట్‌లో ఈ థీమ్ మ్యూజిక్ విన్న తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం యూరోప్‌లో ఒక సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది ‘కల్కి 2898 ఏడీ’.


యూరోప్‌లో పాట..


‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా దిశా పటానీ కనిపించనుంది. ప్రస్తుతం యూరోప్‌లో ప్రభాస్, దిశాల మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. మే 9న మూవీ విడుదల తేదీని ఖరారు చేయడంతో పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ప్రారంభించారు మేకర్స్. భారీ క్యాస్టింగ్‌తో ‘కల్కి 2898 ఏడీ’ రూపుదిద్దుకుంటోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ నటులు.. ఇప్పటికే ఇందులో భాగమయ్యారు. వీరితో పాటు టాలీవుడ్‌కు చెందిన మరెందరో హీరోలు కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఇందులో విష్ణుమూర్తి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని ఇప్పటికే వార్తలు బయటికొచ్చాయి.


Also Read: నా భార్యకేమైనా 16 ఏళ్లా? - ఏజ్‌ గ్యాప్‌ అనేది సమస్యే కాదు.. ట్రోల్స్‌పై ఆర్భాజ్‌ ఖాన్‌