ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీకి ఉన్న మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా ఈ లిస్టును రూపొందించినట్లు పేర్కొన్నారు. IMDB ప్రకారం 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD'.. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. 


2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు:
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా నిలిచింది. 


మలయాళ సినీ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ ఐఎండీబీ అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' మూవీ 3వ స్థానంలో నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హను-మాన్' సినిమా నాలుగో స్థానాన్ని సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. 


హిందీలో కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' సినిమాల ఆరో స్థానంలో నిలిచింది. యామీ గౌత‌మ్, ప్రియమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ 'ఆర్టికల్ 370' సినిమా.. నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు'.. ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన 'ఆవేశం'.. హిందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' చిత్రాలు ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 






2024 అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలు:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కతున్న 'పుష్ప-2' సినిమా IMDB మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్ లిస్టులో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'దేవర 1' చిత్రం సెకండ్ ప్లేస్ లో ఉంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్'.. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి. 


తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' ఐదో స్థానంలో నిలిచింది. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, దీపికా పదుకునే, కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'సింగం అగైన్' సినిమ ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3'.. చియాన్ విక్రమ్, డైరెక్టర్ పా. రంజిత్ కాంబోలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్'.. అజయ్ దేవగన్, టబు కలిసి నటించిన 'ఔరోన్ మే కహన్ దమ్ థా'.. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన 'స్త్రీ 2' చిత్రాలు 2024 అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాల జాబితాలో ఉన్నాయి.






Also Read: విజయసాయి రెడ్డిపై నటి జ్యోతి సెటైర్.. ‘పెళ్ళాం ఊరెళితే’ వీడియోతో మీమ్