మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు... స్వయంగా ఆయనే చెప్పారు. ప్రముఖ ఆస్పత్రి స్టార్ హాస్పిటల్ (Star Hospitals) కొత్తగా క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేసింది. చిరు చేతుల మీదుగా దానిని ప్రారంభించారు. ఆ ఓపెనింగులో చిరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్యాన్సర్ బారిన పడ్డానని తెలిపారు. ఆయన ఏమన్నారు? అసలు ఆయనకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... 


క్యాన్సర్ పెద్ద జబ్బు ఏమీ కాదు! - చిరంజీవి
రోగం వచ్చిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరని, అయితే రోగం రాకుండా చేసే  అవకాశాలు ఎన్నో ఉండి కూడా అవగాహన లేక ఎంతో మంది జబ్బుల బారిన పడుతున్నారని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తనకు క్యాన్సర్ వచ్చిన విషయాన్ని చెప్పారు. 


''క్యాన్సర్ వ్యాధిని ఎర్లీ స్టేజిలో కనిపెడితే... అది ఏమీ పెద్ద జబ్బు కాదు. ప్రజల్లో అవగాహన రావాలి. నేను ఈ విషయం ఇంత వరకు బయట చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను... నాకు 45 ఏళ్ళు దాటినా తర్వాత ఓ ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకున్నాను. ఎర్లీ స్టేజిలో క్యాన్సర్ ఉందని తెలిసింది. ఇది బయటకు చెప్పడానికి నేను ఏమాత్రం ఇబ్బంది పడటం లేదు'' అని చిరంజీవి తెలిపారు. ఒక స్టార్ హీరో ఈ విధంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వైద్యులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి మీద అవగాహన పెరుగుతుందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టెస్టులు చేయించుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  


మొగల్తూరులో తన స్నేహితుడు సైతం ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని, ఆ తర్వాత అది క్యాన్సర్ అని తేలిందని చిరంజీవి తెలిపారు. అతను హైదరాబాద్ వచ్చినప్పుడు రెండో దశ క్యాన్సర్ అని తెలిసి వెంటనే చికిత్స ప్రారంభించామని, ఇప్పుడు తన స్నేహితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలని ఆయన తెలిపారు. ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందని పేర్కొన్నారు.


సినిమా కార్మికులు, అభిమానుల కోసం... 
ఎన్ని కోట్లు అయినా పర్వాలేదు! - చిరంజీవి
సినిమా కార్మికులు, అభిమానుల కోసం ఏదైనా చేయమని స్టార్ ఆస్పత్రి వర్గాలను చిరంజీవి కోరారు. ''మా సినిమా కార్మికులు చాలా పేదవాళ్ళు. రేయి పగలు, దుమ్ము ధూళి, మట్టి వాన వంటివి పట్టించుకోకుండా పని చేస్తారు. ఎవరికి ఏ విధమైన వ్యాధి వస్తుందో తెలియదు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినవి వస్తుందో తెలియదు. అటువంటి వాళ్లకు ఏమైనా చేయగలిగితే బావుంటుంది. వాళ్ళ కోసం, మా అభిమానుల కోసం ప్రతి జిల్లాలో స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేస్తే బావుంటుంది. ఎన్ని కోట్లు అయినా పర్వాలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెబుతాను'' అని చిరంజీవి అడిగారు. చిరంజీవి ఎలా చేద్దామని చెబితే అలా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్టార్ హాస్పిటల్ ప్రతినిథులు చెప్పారు. ప్రతి వారం, రెండు వారాలకు ఒకసారి అయినా సరే క్యాంపులు పెడదామని ఆస్పత్రి వర్గాలు ప్రతిపాదించాయి. 


Also Read : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ