Unstoppable : 'బిగ్ బాస్' ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి నటించిన 'అన్‌స్టాపబుల్' థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు.


హాస్యభరితమైన రచనలకు, మంచి వినోదాత్మక చిత్రాలకు పేరు గాంచిన డైమండ్ రత్నబాబు మరో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ 'అన్‌స్టాపబుల్‌'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'బిగ్ బాస్ 5' టైటిల్ విన్నర్ వీజే సన్నీ, ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తొన్న ఈ చిత్రానికి 'అన్‌లిమిటెడ్ ఫన్' అనేది ట్యాగ్‌లైన్. A2B ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై రజిత్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్‌లు కథానాయికలుగా నటించారు. 


ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో వినోదంతో పాటు డ్రామా, యాక్షన్, గ్లామర్‌ వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో VJ సన్నీ, సప్తగిరిల మంచి స్నేహితులుగా నటిస్తున్నారు. వీరికి డబ్బు అవసరం ఉన్నట్టు ట్రైలర్ ను బట్టి చూస్తే తెలుస్తోంది. అంతలోనే విలన్... ఓ తప్పిపోయిన తన డ్రగ్ కన్సైన్‌మెంట్ కోసం వెతుకుతుంటాడు. అప్పుడు వారిని సన్నీ, సప్తగిరి ఎలా కనుగొంటారు. దాని కోసం వారు ఏం చేస్తారు? అనేది కథాంశంగా తెలుస్తోంది.


కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండడంతో ట్రైలర్ కూడా వినోదభరితంగా ఉంది. సినిమాలోని వీజే సన్నీ, సప్తగిరిల మధ్య యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించేవిగా ఉన్నాయి. ఇక డైమండ్ రత్నబాబు దీన్ని సైడ్‌ స్ప్లిటింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. సన్నీ, సప్తగిరి మోసగాళ్ళు అండ్ బెస్ట్ బడ్డీలుగా వారి పాత్రలలో నటించడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక వీరితో పాటు బిత్తిరి సత్తి, షకలక శంకర్, రఘుబాబు, లాంటి అనేక మంది ఇతర హాస్యనటుల ఈ సినిమాలో నటించారు. డైలాగ్స్ కూడా వినోదభరితంగా ఉన్నాయి. ముఖ్య విషయమేమిటంటే భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో పెద్ద అసెట్ గా మారనుంది. 'వాడ్ని పట్టించిన వాడికి 25 లక్షలు' అని పోలీస్ పోసాని కృష్ణమురళి అనౌన్స్ చేశారు? అయితే, ఎవరి కోసం ఆయన 25 లక్షల రివార్డ్ అనౌన్స్ చేశారు? వీజే సన్నీ, సప్తగిరి తమకు దొరికిన కొకైన్ ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


టీవీలో కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ... ఆ తర్వాత 'బిగ్ బాస్' చేశారు. అక్కడి నుంచి సీరియల్స్, వెబ్ సిరీస్ కు వచ్చారు. వెబ్ సిరీస్ ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. బిగ్ బాస్ 5వ సీజన్ లో విన్నర్ అయిన తర్వాత 'సకలగుణాభిరామ' సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ఏటీఎం' అనే వెబ్ సిరీస్ లోనూ సన్నీ నటించారు.


బిగ్ బాస్ షోపై కీలక వ్యాఖ్యలు


బిగ్ బాస్ వల్ల చాలా మంది తమ కెరీర్ మారిందని చెబుతూంటారు. కానీ వీజే సన్నీ మాత్రం తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. చాలా మంది ఆ షో అర్థమేంటని తిరిగి ప్రశ్నిస్తున్నారని, బిగ్‌బాస్ షో వల్ల తనకు ఫేమ్, పాపులారిటీ వచ్చిన మాట వాస్తవమే... కానీ చాలా మందికి తాను తెలియదన్నారు, షో వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్నారని చెప్పారు. ఓ ఫేమస్ డైరెక్టర్ కూడా బిగ్‌బాస్ షో అంటే ఏంటి? అని ప్రశ్నించాడని వీజే సన్నీ అన్నారు. అప్పట్నుంచి తాను బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పడం మానేసి కెరీర్‌పై ఫొకస్ పెట్టానని సన్నీ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.


Read Also : Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి