చైనా లోన్ యాప్స్ స్కామ్‌లో తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. నకిలీ బిల్లులు, సర్టిఫికెట్లతో రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లించినట్లు ఈడీ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైనా లోన్ యాప్స్ స్కామ్ లో రూ.1400 కోట్ల నిధులను విదేశాలకు మళ్లించిన కేసులో ఈడీ బ్యాంకు అధికారులను ప్రశ్నించింది. బ్యాంకు అధికారుల నుంచి రాబట్టిన సమాచారంలో పలు కీలక అంశాలను ఈడీ గుర్తించింది. నిందితులు నకిలీ ఎయిర్ బిల్లులు, 15 సీబీ సర్టిఫికెట్లు తయారు చేసి వాటిని బ్యాంకులకు చూపించి విదేశాలకు నిధులను మళ్లించినట్లు గుర్తించారు. లోన్ యాప్స్ ద్వారా వచ్చిన నగదును నిందితులు హాంకాంగ్, మారిషస్ దేశాలకు పంపినట్లు విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో చైనా లోన్ యాప్స్ స్కామ్‌లో మరో కేసు నమోదు చేశారు. 


Also Read: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...లారీని ఢీకొట్టిన కారు, ఆరుగురి మృతి


రుణ యాప్ లపై ఓ కమిటీ


ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయని ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 1,100 యాప్‌లు వర్చువల్‌గా రుణాలను అందజేస్తున్నాయి. ఈ రుణ యాప్‌లలో 600 పైగా చట్టవిరుద్ధమైనవని తెలిపింది. ఇవి 80 పైగా ఎక్కువ అప్లికేషన్ స్టోర్‌లలో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. సైబర్ క్రైమ్‌లను నిరోధించడానికి డిజిటల్ ఫైనాన్సింగ్ యాప్‌లను ధ్రువీకరించాల్సిన చట్టాలను సెంట్రల్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. వర్చువల్‌గా నిర్వహించే వివిధ యాప్‌ల ద్వారా వేధింపులు, బెదిరింపులతో వసూళ్లు, సహా ఆన్‌లైన్ లోన్ స్కామ్ ఆరోపణలపై ఈ కమిటీని విచారణ చేయనుంది. ఆన్‌లైన్ రుణాలకు సంబంధించి కొన్ని నియమాలు అమలు చేయాల్సి ఉందని ఈ కమిటీ భావిస్తోంది. ఆర్బీఐ కేవైసీ ప్రమాణాలు పాటించని లోన్ యాప్ లను నిషేధించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. రుణదాతల బ్యాలెన్స్ షీట్ కు సంబంధించి సాంకేతిక సామర్థ్యాలను అంచనా వేయడానికి నోడల్ సంస్థ ఏర్పాటు చేయాలని పేర్కొంది. 


Also Read: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి 


Also Read: ఆ అమ్మాయిలు రాత్రి మద్యం సేవించారు.. ఆపై నా మాట వినలేదు.. జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు ఆవేదన


Also Read: తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పేలిన తుపాకులు... ఇద్దరు మావోయిస్టులు మృతి.. తప్పించుకున్న అగ్రనేతలు!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి