Hit 4 Hero Update In Hit 3 Movie Ending: 'హిట్' సిరీస్ / ఫ్రాంచైజీలో నెక్స్ట్ హీరో ఎవరో అఫీషియల్‌గా రివీల్ అయ్యింది. 'హిట్ 2' క్లైమాక్స్ తర్వాత సీన్‌లో 'హిట్ 3'లో హీరోగా అర్జున్ సర్కార్ పాత్రలో న్యాచురల్ స్టార్ నానిని పరిచయం చేశారు. ఇక ఇప్పుడు 'హిట్ 4'లో హీరోను 'హిట్ 3' ఎండింగ్‌లో చూపించారు. అమెరికాలో ప్రీమియర్ షోలు పడటంతో ఆ హీరో ఎవరు? అనే దానితో పాటు అతని పేరు కూడా రివీల్ అయ్యింది.

Continues below advertisement


'ఏసీపీ వీరప్పన్' పాత్రలో కార్తీ!
'హిట్ 4'లో హీరో కార్తీ అని కొన్ని రోజుల క్రితం లీక్స్ వచ్చాయి. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఆ లీక్స్ పట్ల దర్శకుడు శైలేష్ కొలను సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అది పక్కన పెడితే... అమెరికా ప్రీమియర్స్ తర్వాత 'హిట్ 4'లో హీరో అఫీషియల్‌గా రివీల్ అయ్యారు.


'హిట్ 3' ఎండింగ్‌లో కార్తీ ఎంట్రీ ఇచ్చారు. ఏసీపీ వీరప్పన్ పాత్రలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద రిపోర్ట్ చేయనున్నారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే... 'హిట్ 4'లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు. మరి, సీఎస్కే ఫ్యాన్ అయిన వీరప్పన్ ఏం చేస్తాడో 'హిట్ 4'లో చూడాలి.


Also Readహిట్ 3 ట్విట్టర్ రివ్యూ: కొరియన్ సిరీస్ కాపీ... విపరీతమైన వయలెన్స్... సోషల్ మీడియాలో నాని సినిమా టాకేంటి?














పోలీస్ ఆఫీసర్ రోల్స్ కార్తీకి కొత్త కాదు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాజమౌళి తీసిన 'విక్రమార్కుడు'ను తమిళంలో రీమేక్ చేశారు. ఇక 'ఖాకి' సినిమా తెలుగులోనూ హిట్ అయ్యింది. త్వరలో విడుదల కానున్న 'వా వాతియార్'లోనూ ఆయనది పోలీస్ రోల్. అందులో కామెడీ చేయనున్నారు. తమిళనాట సూపర్ హిట్ పోలీస్ సినిమాల్లో కార్తీ అన్నయ్య సూర్య నటించిన 'సింగమ్' సిరీస్ ఉంటుంది. 'హిట్ 4'లో వీరప్పన్ పాత్రలో కార్తీ అంటే తెలుగుతో పాటు తమిళంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది.


Also Read: ట్విట్టర్‌లో 'రెట్రో' రివ్యూస్ లేవ్... నెగెటివిటీ రాకుండా సూర్య టీమ్ ప్లాన్... ఫస్ట్ షో ఎప్పుడు? USA Premiere Show రిపోర్ట్ వచ్చేదెప్పుడు?



'హిట్ 3'కి ఓవర్సీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
'హిట్ 3' సినిమాకు ఓవర్సీస్ నుంచి మంచి రిపోర్ట్స్ వచ్చాయి. నాని పెర్ఫార్మన్స్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. వయలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ... ఈ మూవీ హాలీవుడ్ స్టైల్ సినిమాలు నచ్చే ప్రేక్షకులను మెప్పిస్తుందని టాక్. బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.