కొత్త పాట విడుదలైన తర్వాత ట్యూన్ లేదా లిరిక్స్ గురించి కాస్త డిస్కషన్ జరగడం సహజం. ఇంకో అడుగు ముందుకు వేస్తే... సింగర్స్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. కానీ, విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'కింగ్డమ్'లో మొదటి పాట ప్రోమో విడుదలైన తర్వాత అందులోని లిప్ లాక్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. అది సోషల్ మీడియా అంతటా వైరల్ అయింది.

భాగ్యశ్రీ బోర్సేతో విజయ్ దేవరకొండ లిప్ లాక్!'కింగ్డమ్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన 'మిస్టర్ బచ్చన్' భామ భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ చూస్తే ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు ఇంపార్టెన్స్ ఉందనేది చెప్పడం కోసం అనుకుంట... తొలి పాటలోనే రొమాంటిక్ లిప్ లాక్ చూపించారు. 

'కింగ్డమ్' సినిమాలోని మొదటి పాట 'హృదయం లోపల' మే రెండవ తేదీన... అంటే శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ రోజు (ఏప్రిల్ 30, బుధవారం) ప్రోమో రిలీజ్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే మధ్య లిప్ లాక్ చూపించారు. సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. 'వాళ్లు బ్రతకడం కోసం ప్రేమను నటిస్తారు. కానీ, త్వరలో అది (ఆ ప్రేమ) నిజం అని అనిపిస్తుంది'' అని ఈ సాంగ్ ప్రోమోకి క్యాప్షన్ ఇచ్చారు.

Also Readనాని 'హిట్ 3' ఫస్ట్ షో డీటెయిల్స్‌... ట్విట్టర్ రివ్యూస్, USA Premier Show రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

అనిరుద్ రవిచందర్ నుంచి మరో హిట్ సాంగ్!'కింగ్డమ్'కు యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ చేస్తున్నారు. ఆయన స్టైల్ ఆఫ్ సాంగ్ 'హృదయం లోపల' అని చెప్పవచ్చు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రోమోలో అనిరుద్ బీట్, మెలోడీ వినిపించాయి. ఈ పాటను ఆయన స్వయంగా పాడారు. ఇందులో ఫిమేల్ లిరిక్స్ అనుమిత నదేశన్ ఆలపించారు. కేకే సాహిత్యం అందించారు. హృదయం లోపల పాటకు దార్ గై నృత్య దర్శకత్వం వహించినట్లు చిత్ర బృందం తెలిపింది. విజయ్ దేవరకొండతో అనిరుద్ ఫస్ట్ మూవీ ఇది. ఆయన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

'జెర్సీ' విజయం తర్వాత గౌతమ్ తిననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కింగ్డమ్'. దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డియోస్ సంస్థల మీద సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read: శివయ్యా... ఆ డైలాగ్ తీసేశాం - విష్ణు మంచు & 'కన్నప్ప' టీంకు సారీ చెప్పిన శ్రీ విష్ణు