'శివయ్యా...' డైలాగ్ మీద చెలరేగిన వివాదానికి హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) ఫుల్ స్టాప్ పెట్టారు. డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu)తో పాటు 'కన్నప్ప' చిత్ర బృందానికి సారీ చెప్పారు. అసలు వివాదం ఏమిటి? ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే...
'సింగిల్' ట్రైలర్‌లో శివయ్యా...విష్ణు మంచును ట్రోల్ చేశారా?విష్ణు మంచు కథానాయకుడిగా రూపొందుతున్న మైథలాజికల్ ఫాంటసీ ఫిల్మ్ 'కన్నప్ప'. పాటలతో పాటు ప్రచార చిత్రాలు ఆ సినిమా మీద అంచనాల పెంచాయి. అయితే... 'శివయ్యా' అంటూ విష్ణు మంచు చెప్పిన డైలాగ్‌ను కొందరు ట్రోల్ చేశారు. 'సింగిల్' ట్రైలర్ విషయానికి వస్తే... అందులోనూ హీరో శ్రీ విష్ణు 'శివయ్యా' అంటూ డైలాగ్ చెప్పారు.
'కన్నప్ప' ట్రైలర్ ముందుగా విడుదల కావడం, ఆ తర్వాత 'సింగిల్' సినిమా ట్రైలర్ రావడంతో... విష్ణు మంచును ట్రోల్ చేసే విధంగా శ్రీ విష్ణు 'శివయ్యా' డైలాగ్ చెప్పారని నెటిజనులు భావించారు. ఆ డైలాగ్ పట్ల విష్ణు మంచు అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అంతే కాదు... కంప్లైంట్ ఇవ్వాలని భావించినట్లు కూడా లీక్స్ వచ్చాయి. విష్ణు మంచు హర్ట్ అయిన విషయం 'సింగిల్' చిత్ర బృందానికి తెలిసింది. దాంతో వెంటనే క్షమాపణలు చెబుతూ శ్రీ విష్ణు ఒక వీడియో విడుదల చేశారు.
శివయ్యా డైలాగ్ తీసేశాం...ఎవరిని హార్ట్ చేసే ఉద్దేశం లేదు!విష్ణు మంచు పేరును శ్రీ విష్ణు ప్రస్తావించలేదు. కానీ, 'కన్నప్ప' చిత్ర బృందం హర్ట్ అయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎవరిని హార్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని అందుకే 'శివయ్యా' డైలాగ్స్ సినిమా నుంచి తీసేశామని శ్రీ విష్ణు తెలిపారు.
సినిమా ఇండస్ట్రీలో తామంతా ఒకటే కుటుంబం అని, కుటుంబ సభ్యులను హార్ట్ చేసే ఉద్దేశం తమకు అసలు లేదని, 'సింగిల్' సినిమాలో చిరంజీవి, బాలకృష్ణతో పాటు అల్లు అరవింద్ సహా కొంత మంది చెప్పిన డైలాగులను సరదాగా ఉపయోగించామని శ్రీ విష్ణు వివరించారు. ప్రజెంట్ మీమ్స్, సోషల్ మీడియాలలో వైరల్ అయిన డైలాగ్స్ కొన్ని సినిమాలో ఉన్నాయన్నారు. అయితే ఒకరిని హార్ట్ చేయడం తమ ఉద్దేశం కాదని తెలిపారు. శివయ్య డైలాగ్ సినిమాలో ఉండదని స్పష్టం చేశారు. కన్నప్ప టీం హర్ట్ అయినందుకు ఆ డెసిషన్ తీసుకున్నామని తెలిపారు.
Also Read: మహేష్ పాస్ పోర్ట్ సీజ్ చేయడం అంత వీజీ కాదు... మళ్ళీ ఫారిన్‌కు సూపర్ స్టార్
మే 9న 'సింగిల్' సినిమా థియేటర్లలోకి వస్తుంది. వాస్తవానికి 'కన్నప్ప' ఏప్రిల్ 25న విడుదలకు రెడీ అయింది. కానీ, కొన్ని కారణాల వల్ల జూన్ 25కు వాయిదా పడింది. అందువల్ల శ్రీ విష్ణు సినిమా కంటే కాస్త ఆలస్యంగా విష్ణు మంచు సినిమా థియేటర్లలోకి వస్తుంది. శ్రీ విష్ణు సరసన 'రొమాంటిక్' భామ కేతికా శర్మ, 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా హీరోయిన్లుగా నటించిన 'సింగిల్' సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.