Just In
Mahesh Babu: మహేష్ పాస్ పోర్ట్ సీజ్ చేయడం అంత వీజీ కాదు... జక్కన్న సినిమాకు బ్రేక్ ఇచ్చి... మళ్ళీ ఫారిన్‌కు సూపర్ స్టార్
SSMB29 Latest Update: సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మీద రాజమౌళి ఒక పాట తీస్తున్నారు. అది పూర్తయిన వెంటనే సమ్మర్ హాలిడేస్‌కు మహేష్ వెళతారని తెలిసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పాస్ పోర్ట్ సీజ్ చేసినట్లు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)ఆ మధ్య ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే... అంత ఈజీ కాదు. పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేసే అలవాటును మహేష్ బాబు వదులుకోవడం లేదు. ఎప్పటిలా ఒకవైపు షూటింగ్స్ చేస్తూ మరొక వైపు టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన మరొకసారి ఫారిన్ ట్రిప్ పైన ఉన్నట్లు సమాచారం.
ప్రియాంక చోప్రాతో మహేష్ బాబు పాట!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గ్లోబ్ ట్రాంటింగ్ జోనర్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శంకర్ పల్లిలో సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా మీద ఒక పాటను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఆ పాటకు, మహేష్ పాస్ పోర్ట్‌కు సంబంధం ఏమిటి? అంటే...
సాంగ్ షూట్ పూర్తయ్యాక సమ్మర్ హాలిడేస్!
ప్రియాంక చోప్రాతో స్టెప్స్ వేస్తున్న మహేష్ బాబు... ఆ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే సమ్మర్ హాలిడేస్ తీసుకుంటున్నారని టాక్. మహేష్ నమ్రత దంపతుల కుమార్తె సితార ఘట్టమనేనికి వేసవి సెలవులు ఇచ్చేశారు. కుమారుడు గౌతమ్ విషయానికి వస్తే... ఆ అబ్బాయి ఇండియాలో లేడు. విదేశాలలో చదువుతున్నారు. అతని దగ్గరకి మహేష్ నమ్రత సితార వెళతారని సమాచారం.
పిల్లలకు సమ్మర్ హాలిడేస్ రావడంతో నెల పాటు చిత్రీకరణలకు గ్యాప్ ఇవ్వాలని మహేష్ బాబు డిసైడ్ అయ్యారట. ఈ నెల రోజులు ఆయన ఇండియాలో ఉండరని, ఫ్యామిలీతో కలిసి విదేశాలు వెళుతున్నారని తెలిసింది. నెల బ్రేక్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు... ఇది తెలిసిన సినిమా ఇండస్ట్రీ జనాలు మహేష్ పాస్పోర్ట్ సిసి చేయడం అంత బిజీ కాదు అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కే ఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో మాలీవుడ్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు రాజమౌళి దర్శకత్వం వహించిన 'త్రిబుల్ ఆర్' (ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం) సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కారు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలోని పాటలపై అంతర్జాతీయ స్థాయిలోని ప్రేక్షకులు చూప పడింది. గ్లోబల్ లెవల్‌లోనూ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: శర్వా38... ఇప్పట్నుంచి 'భోగి'... షూటింగ్ మొదలైంది... టైమ్ పీరియడ్, స్టోరీ బ్యాక్‌డ్రాప్ ఇదే