Nani's Hit The Third Care USA Premieres Report: ఇండియన్ ఆడియన్స్ సైతం ఇప్పుడు అమెరికాలో ప్రీమియర్స్ వైపు చూస్తున్నారు. అక్కడ నుంచి సినిమాకు వచ్చే రిపోర్ట్ కీలకం అవుతోంది. అమెరికాలో ప్రీమియర్స్ లేటుగా వేయాలని ఈ మధ్య ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో చర్చలు జరిగినట్టు లీక్స్ వచ్చాయి. మరి, న్యాచురల్ స్టార్ నాని 'హిట్ 3' సినిమా ఫస్ట్ ప్రీమియర్ అమెరికాలో ఎన్ని గంటలకు పడుతుంది? ఈ మూవీ ట్విట్టర్ రివ్యూస్ ఎన్నింటికి వస్తాయి? అంటే...
అమెరికాలో మధ్యాహ్నం 2.30కు...ఇండియాలో తెల్లవారుజామున ఏ టైం అంటే?అమెరికాలో 'హిట్ 3' మొదటి షో ఏప్రిల్ 30వ తేదీన 2:30PM గంటలకు పడుతుందని తెలిసింది. అదే ఫస్ట్ ప్రీమియర్ షో. మన ఇండియన్ టైమింగ్ విషయానికి వస్తే... మే 1న మిడ్ నైట్ 12 గంటల సమయంలో 'హిట్ 3' షో మొదలు అవుతుంది.
ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడు?ట్విట్టర్ రివ్యూలు ఎన్ని గంటలకు వస్తాయి?Hit The Third Case Runtime: 'హిట్ 3' రన్ టైం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు (2.37) గంటలు. ఇంటర్వెల్ ఒక 15 నిమిషాలు అనుకున్నా... దగ్గర దగ్గర సినిమా షో పూర్తి కావడానికి మూడు గంటలు పడుతుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఫస్ట్ షో పడే సమయానికి ప్రీమియర్ రిపోర్ట్స్, ట్విట్టర్ రివ్యూస్ వచ్చేస్తాయి. మే 1న తెల్లవారుజామున మూడు లేదా మూడున్నర గంటల సమయంలో సినిమా రిజల్ట్ ఏమిటి అనేది బయట పడుతుంది.
Also Read: 'హిట్ 3'లో హీరోయిన్‌తో అడివి శేష్ ఫైట్... చివరి అరగంటలో బోలెడు సర్‌ప్రైజ్‌లు!
నాని జడ్జ్మెంట్ మీద ఆడియన్స్ నమ్మకం...తప్పకుండా హ్యాట్రిక్ కొడతారని బలమైన రిపోర్ట్!'సరిపోదా శనివారం'తో హీరోగా నాని భారీ విజయం అందుకున్నారు. ఆ తరువాత ఆయన నిర్మించిన 'కోర్ట్' సైతం సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు వచ్చాయి. చిన్న సినిమాగా విడుదలైన 'కోర్ట్' 50 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తుంది. ఆ రెండు విజయాల తర్వాత 'హిట్ 3' సినిమాతో నాని హ్యాట్రిక్ కొడతారని బలమైన రిపోర్ట్ అందుతోంది.
Also Read: శేష్ మామూలోడు కాదు... స్టేజి మీద 'హిట్ 3' హీరోయిన్ శ్రీనిధికి షాక్ ఇచ్చాడు... వైరల్ వీడియో చూడండి
'హిట్ 3' సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇందులో అడివి శేష్ అతిథి పాత్రలో సందడి చేశారు. కోమలి ప్రసాద్ సహా పలువురు నటించిన ఈ సినిమా మే 1న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల అవుతోంది.