న్యాచురల్ స్టార్ నాని 'హిట్ 3' ట్విట్టర్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా చూశామని, తమ రేటింగ్ ఇదేనని గురువారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. 'హిట్ 3'తో పాటు మే 1న విడుదలకు సిద్ధమైన మరో సినిమా 'రెట్రో'. కోలీవుడ్ స్టార్ సూర్య, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రమిది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూ పోస్టులు లేవు. ట్విట్టర్ రివ్యూలు రాలేదు. ఎందుకో తెలుసా?
నెగిటివిటీకి అడ్డుకట్ట వేసేలా...సూర్య 'రెట్రో' టీం కొత్త ప్లాన్ రెడీ!?Suriya and Pooja Hegde's Retro Review In Telugu: సూర్య 'రెట్రో' సినిమా ట్విట్టర్ రివ్యూలు ఎర్లీ మార్నింగ్ రాకపోవడానికి రీజన్ ఉంది. USA, UK, Dubai, Australia వంటి దేశాలలో ప్రీమియర్ షోలు వేయడం వల్ల పని కట్టుకుని కొంత మంది నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని కొందరు సెలబ్రెటీలు ఎప్పటి నుంచో అభిప్రాయపడుతున్నారు. సూర్య లాస్ట్ సినిమా 'కంగువ' రివ్యూల విషయంలో ఆయన భార్య జ్యోతిక అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్య రెట్రో సినిమా టీం కొత్త ప్లాన్ రెడీ చేసినట్టు టాక్. అమెరికాలో ప్రీమియర్స్ వేయడం మానేసింది. తమిళ ఇండస్ట్రీలో కొందరు ఫాలో అవుతున్నది ఇదే.
ఫస్ట్ షో పడేది హైదరాబాద్‌లో...చెన్నై కంటే తెలంగాణలో ముందు!తమిళనాడు రాజధాని చెన్నైలో 'రెట్రో' సినిమా ఫస్ట్ షో ఉదయం 9 గంటలకు పడుతుంది. తమిళనాట తెల్లవారుజామున బెనిఫిట్ షోలు వేయడానికి అనుమతి లేదు. ఎవరి సినిమా అయినా సరే 9 గంటలకు మొదటి ఆట పడుతుంది. సూర్య 'రెట్రో' సినిమాకు కూడా అంతే. ఓవర్సీస్ ఏరియాలలో కూడా ఉదయం 9 గంటల నుంచి షోలు పడేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. చెన్నైలో తొమ్మిదింటికి ఫస్ట్ షో పడుతుంటే... హైదరాబాద్ సిటీలో 8 గంటల నుంచి 'రెట్రో' తమిళ షోలు పడుతున్నాయి. చెన్నై కంటే తెలంగాణలో ముందుగా సినిమా రిలీజ్ కానుంది. ఇక్కడి నుంచి వచ్చే టాక్ సినిమాకు కీలకం కానుంది. అది సంగతి.
Also Read: శివయ్యా... ఆ డైలాగ్ తీసేశాం - విష్ణు మంచు & 'కన్నప్ప' టీంకు సారీ చెప్పిన శ్రీ విష్ణు
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన 'రెట్రో' సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పాటల్లో పూజా హెగ్డే డాన్స్ వైరల్ అయింది. దాంతో బజ్ బాగా వచ్చింది. టైలర్స్ కూడా క్లిక్ అయ్యాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.