దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా... కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి కథానాయికలుగా నటించిన సినిమా 'హే సినామికా'. కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ట్రైలర్లు, పాటలు చూస్తే... రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ కలిగింది. 'బాహుబలి'లో కిలికిలి భాష సృష్టికర్త మదన్ కార్కి కథ అందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే... చెన్నైలో బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసిన సెలబ్రిటీలు చాలా బావుందని చెప్పినట్టు సమాచారం. ప్రీమియర్ షోస్ రిపోర్ట్ బావుంది.

 

'హే సినామికా'లో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరితో హీరో దుల్కర్ సల్మాన్ కెమిస్ట్రీ బావుందని సోషల్ మీడియా టాక్. కామెడీ కూడా బాగా వర్కవుట్ అయ్యిందట. ఇంకా ఈ సినిమా గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే...