Raashi Khanna Role In Pakka Commercial Revealed: గోపీచంద్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'పక్కా కమర్షియల్' ట్రైలర్ చూశారా? అందులో హీరోతో పాటు హీరోయిన్ రాశీ ఖన్నాకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఆమె డైలాగులు, మేనరిజమ్స్ హైలైట్ అయ్యాయి. ఇప్పుడు ఆమె రోల్ ఏంటనేది సినిమా యూనిట్ రివీల్ చేసింది.
Raashi Khanna As Serial Artist: 'పక్కా కమర్షియల్'లో రాశీ ఖన్నా సీరియల్ ఆర్టిస్టుగా కనిపించనున్నారు. ఆమె కడుపుబ్బా నవ్విస్తారని యూనిట్ చెబుతోంది. ''పది సంవత్సరాల పాత్ర. పదిహేనో ఏట ప్రారంభించిన నటన యాత్ర'' అంటూ రాశీ ఖన్నా పాత్రను ట్రైలర్‌లో సప్తగిరి చేత పరిచయం చేయించారు. సీరియల్‌లో తన పాత్రను చంపేశారని ఆమె కోర్టుకు ఎక్కడం వంటి ఎపిసోడ్స్ బాగా పేలాయని టాక్. ట్రైలర్‌కు మించి సినిమాలో మరింత కామెడీగా ఆమె రోల్ ఉంటుందట.
Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది
కామెడీ అండ్ యాక్షన్ మేళవించిన లాయర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్న చిత్రమిది. యూవీ క్రియేషన్స్, జీఏ (గీతా ఆర్ట్స్) 2 పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'బన్నీ' వాసు నిర్మాత. జూలై 1న సినిమా విడుదల కానుంది. 'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న చిత్రమిది.
Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?