Allu Arjun's Pushpa The Rule Movie Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సూపర్ హిట్ 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్‌గా త్వరలో 'పుష్ప: ది రూల్' షూటింగ్ స్టార్ట్ కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారని యూనిట్ వర్గాల సమాచారం. అయితే, ముందుగా కథలో కొన్ని కీలక మార్పులు చేశారట. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలను నెక్స్ట్ లెవల్‌లో ఉండేలా చూసుకుంటున్నారట. అయితే, కొత్తగా చేసిన మార్పుల వల్ల రష్మిక పాత్రకు అన్యాయం జరగబోతుందని టాక్.


Pushpa 2 - Rashmika Character Twist Revealed: 'పుష్ప'లో పుష్పరాజ్‌ను పట్టుకోవడం కోసం అతడి భార్య శ్రీవల్లి (రష్మిక పాత్ర)ను పోలీసులు ఎరగా వాడుకుంటారట. ఆ క్రమంలో చివరకు, క్లైమాక్స్‌లో శ్రీవల్లి మరణింస్తుందని సోషల్ మీడియా గుసగుస. పాత్రను చంపేయడం ద్వారా రష్మిక పాత్రకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందనేది సినిమా విడుదల ముందు వరకూ చెప్పడం కష్టమే. ఈ లోపు మార్పులు జరగొచ్చు.


Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది


Pushpa 3 On Cards?: 'పుష్ప 2' షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే, అప్పుడే 'పుష్ప 3' గురించి చర్చ మొదలైంది. సుకుమార్ మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ గుసగుస.


Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?