సెలబ్రిటీల జీవితాలు ఎంత విలాసవంతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ చిన్న విషయంలో వారు లగ్జరీనే కోరుకుంటారు. అలాంటిది అత్యవసరాల విషయాలలో వారు అత్యధిక ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం వెనకాడరు. చాలామంది సినీ సెలబ్రిటీలు తాము సంపాదించేంది చాలావరకు తమ పిల్లల విలాసవంతమైన జీవితం కోసమే ఖర్చుపెడతారు. బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య చదువు కోసం  ఎంత ఖర్చు పెడుతోందనే విషయం తాజాగా బయటికొచ్చింది.


ముంబాయ్‌లోనే కాస్ట్‌లీ స్కూల్


ఈరోజుల్లో స్కూల్ ఫీజులు అనేవి లక్షల్లో ఉంటున్నాయని అన్నది ఓపెన్ సీక్రెట్. సాధారణ మిడిల్ క్లాస్ జీవితాలు గడిపేవారు కూడా పిల్లల స్కూలు ఫీజులు కోసం లక్షలు ఖర్చుపెట్టడానికి వెనకాడడం లేదు. అలా చేస్తేనే వారి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారు. అలాంటిది కోట్లలో సంపాదించే సినీ సెలబ్రిటీలు వారి పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చుపెట్టడం పెద్ద విషయమేమీ కాదు. బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నా.. అప్పుడప్పుడు ఒకట్రెండు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మళ్లీ వెండితెరపై కనిపించడం మానేసింది. మరోవైపు తన భర్త అభిషేక్ బచ్చన్ కూడా సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేడు. అయినా కూడా తమ కూతురు చదువు కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. వారి కూతురు ఆరాధ్య ముంబాయ్‌లోని అత్యంత ఖరీదైన స్కూలులో చదువుతోంది. అదే ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ స్కూల్‌లో ఫీజుల గురించి వింటుంటే షాక్ అవ్వాల్సిందే.


ఫీజులు ఎలా ఉన్నాయంటే


ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫీజు  రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అక్కడ ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు ఫీజు రూ.1.70 లక్షలు ఉంటుందట. ఇక 8వ తరగతి నుంచి 10 తరగతి వరకు ఫీజు రూ.4.48 లక్షలు అని సమాచారం. ఇక ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే 11,12 క్లాసులు కూడా ఉన్నాయి. వాటికి ఫీజు రూ.9.65 లక్షలు అని తెలుస్తోంది. కేవలం ఐశ్వర్య, అభిషేక్ ముద్దుల కూతురు ఆరాధ్య మాత్రమే కాదు.. షారుఖ్ ఖాన్ కొడుకు అబ్రహం కూడా ఈ స్కూల్‌లోనే చదువుతున్నాడు. వీరితో పాటు సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, చుంకీ పాండే తదితర సెలబ్రిటీల పిల్లలు కూడా ఇదే స్కూల్‌లో తమ చదువును కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ కూతురు 6వ తరగతి చదువుతోందట.


ఐశ్వర్య, అభిషేక్‌ల ప్రేమ ప్రయాణం


1999లో ‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ అనే సినిమా షూటింగ్‌లో ఐశ్వర్య, అభిషేక్ మొదటిసారి కలుసుకున్నారు. అప్పటినుంచి వారు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. 2006లో వారు కలిసి నటించిన ‘ఉమ్రవ్ జాన్’ అనే చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2007లో ముందుగా తన మనసులోని మాటను అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్య రాయ్‌కు చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దానికి ఐశ్వర్య కూడా వెంటనే ఓకే చెప్పేసింది. అదే ఏడాది వీరిద్దరికీ పెళ్లి కూడా జరిగింది. 2011లో వారికి ఆరాధ్య పుట్టింది. పెళ్లి తర్వాత అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించిన ఐశ్వర్య.. ఇప్పుడు పూర్తిగా తన పర్సనల్ లైఫ్‌పైనే ఫోకస్ పెట్టింది.


Also Read: బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial