Duniya Vijay In Puri Jagannadh Vijay Sethupathi Movie: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మూవీ ప్రకటించినప్పటి నుంచీ భారీ హైప్ నెలకొంది. విజయ్‌ను ఓ డిఫరెంట్ రోల్‌లో చూపించబోతున్నట్లు ప్రచారం సాగుతుండగా అసలు పూరీ.. ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరీ ఎంచుకున్నారో అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నటీనటుల వివరాలను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్న మూవీ టీం తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది.

కీ రోల్‌లో వీరసింహారెడ్డి విలన్

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ (Duniya Vijay) నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. ఆయన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చినా.. వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో వాటికి నో చెప్పారు. ఇప్పుడు తాజాగా.. పూరీ మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు. 

Also Read: వాళ్లు లేడీస్‌రా.. వాళ్లు చావరు మనల్ని చంపుతారు - ఆకట్టుకునేలా శ్రీవిష్ణు '#సింగిల్' ట్రైలర్

టైటిల్ అదేనా?

ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పూరీ ఈ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పూరీ చెప్పిన కథకు ఫస్ట్ సిట్టింగ్‌లోనే విజయ్ ఓకే చెప్పేశారు. దీంతో అసలు ఆ స్టోరీ ఏమై ఉంటుందా? అని అందరిలోనూ భారీ హైప్ నెలకొంది. ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

హీరోయిన్‌ ఎవరంటే?

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ టబు.. సినిమాలో నటించనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. అయితే, ఆమెనే హీరోయిన్ అని అంతా భావించారు. కానీ.. ఆమెది కీ రోల్ మాత్రమే అని.. అసలు హీరోయిన్ వేరే ఉన్నారని తెలుస్తోంది. విజయ్ సరసన.. హీరోయిన్ రాధికా ఆప్టే నటించనున్నారనే ఫిలిం నగర్ వర్గాల టాక్. బాలకృష్ణ 'లెజెండ్', 'లయన్' సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాధిక. ఇప్పుడు ఈ మూవీతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్ పతాకం మీద పూరి జగన్నాథ్ చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మూవీతో పూరీ కమ్ బ్యాక్ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.