ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నామంటూ ఊరించిన మేకర్స్, దాన్ని పోస్ట్ పోన్ చేసి నిరాశపరిచారు. అయితేనేం తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ లీక్ ఒకటి బయటకు వచ్చింది. 


హిస్టారికల్ క్లైమాక్స్... 15 కోట్ల ఖర్చుతో!
సాధారణంగానే సినిమాలకు క్లైమాక్స్ ఆయువు పట్టు లాంటిది అని చెప్పవచ్చు. సినిమా మొత్తం ఒక ఎత్తైతే, క్లైమాక్స్ మరొక ఎత్తు. మొదట్లో ఎలా ఉన్నా సరే క్లైమాక్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉందంటే సినిమా హిట్ అయినట్టే లెక్క. అయితే తాజాగా 'హరిహర వీరమల్లు' సినిమా విషయంలో కూడా మేకర్స్ ఇలాంటి అదిరిపోయే క్లైమాక్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 'హరి హర వీరమల్లు' సినిమాలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒక హిస్టారికల్ క్లైమాక్స్ సీన్ ని క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక క్రేజీ విషయం ఏమిటంటే ఈ క్లైమాక్స్ లో కేవలం 8  నిమిషాల షాట్ కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. సినిమా, దానికి సంబంధించిన అప్డేట్లు లేట్ అయితేనే... లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను అన్నట్టుగా 'హరిహర వీరమల్లు' అదిరిపోయే రేంజ్ లో ఉంటే అదే చాలు అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. నిజానికి మెగా అభిమానులు 'హరిహర వీరమల్లు' కంటే 'ఓజి' సినిమా కోసమే ఆకలి మీద ఉన్నారు. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ లీక్స్ బయటకు వస్తుండడంతో, దీనిపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.


Also Read: వార్నీ... 'జబర్దస్త్' బ్యూటీ ఒరిజినల్ పేరు రీతూ చౌదరి కాదు - 700 కోట్ల లాండ్ స్కాంతో ఆ సీక్రెట్, అసలు పేరు వెలుగులోకి 






మాట వినాలి... పవన్ పాట విడుదల
పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 90 శాతం పూర్తి కాగా, 'హరి హర వీరమల్లు' సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీపై హైప్ పెంచే పనిలో ఉన్నారు మేకర్స్. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు. జనవరి 6న ఉదయం 9 గంటలకు తొలి పాట 'మాట వినరా'ను రిలీజ్ చేయబోతున్నామని, అది కూడా స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన పాట అంటూ ఊరించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటని ఎప్పుడెప్పుడు వింటామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. కానీ తీరా చూస్తే అభిమానులకు డిసప్పాయింటింగ్ న్యూస్ ఇచ్చింది టీం. ఈ పాటను వాయిదా వేస్తున్నామంటూ షాక్ ఇచ్చింది. త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ కు సంబంధించి కొత్త డేట్, టైం ని అనౌన్స్ చేస్తామని వెల్లడించింది.


Also Read:మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు