Interesting Facts About Actor Vikram: నటుడిగా విక్రమ్ అందుకున్న శిఖరాలు అసామాన్యం. ఓ సాధారణ స్థాయి నటుడి నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యాక్టర్‌గా విక్రమ్ సాగించిన జర్నీ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరిస్తున్న విక్రమ్ జీవితంలో మరిచిపోలేని సంఘటనలున్నాయి. నేడు విక్రమ్ పుట్టినరోజు (Happy Birthday Actor Vikram) సందర్భంగా ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
కెనడీ జాన్ విక్టర్.. ఈపేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. .హీరో విక్రమ్ అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. విక్రమ్ అనే పేరు తెరపై పడితే చాలు ప్రతీసారి ఓ యూనిక్ అండ్ న్యూ కాన్సెప్ట్ ను సినీ ప్రేమికులు ఆయన నుంచి ఆశిస్తారు. తమిళంలో కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో నటనలో ప్రయోగాలు చేసిన వ్యక్తిగా పేరు సాధించిన విక్రమ్... ఎన్నో వేరియషన్స్... సరికొత్త కాన్సెప్ట్ లతో సినిమా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
ఎప్పుడో 1990లో ఎన్ కాదల్ కన్మణి సినిమాతో తెరపైకి వచ్చిన విక్రమ్... కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1999లో డైరెక్టర్ బాలా తీసిన సేతు సినిమాతో విక్రమ్ ఫేజ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ బాలానే పితామగన్ తీస్తే అదేనండీ తెలుగులో శివపుత్రుడు సినిమాతో విక్రమ్ పేరు జాతీయ స్థాయిలో మోగిపోతుంది. ఆ సినిమాకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు ఆయన. ఆ తర్వాత విక్రమ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అపరిచితుడు ఓ బెంచ్ మార్క్..
శంకర్ డైరెక్షన్ లో వచ్చిన అపరిచితుడు సినిమా విక్రమ్ యాక్టింగ్ కి ఓ బెంచ్ మార్క్. శంకర్ తీసిన ఐ మనోహరుడు లో విక్రమ్ నటన అదుర్స్. సుశీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన మల్లన్న, ఏఎల్ విజయ్ తీసిన నాన్న, మణిరత్నం రావణ్ సినిమా ఇవన్నీ జయాజయాలతో సంబంధం లేకుండా నటుడిగా విక్రమ్ స్థాయిని పెంచిన సినిమాలే. బెస్ట్ యాక్టర్ గా ఓ నేషనల్ అవార్డు, ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు (Seven Filmfare Awards South) అందుకున్న విక్రమ్ ను తమిళనాడు ప్రభుత్వం 2004లో కలైమామణి (Kalaimamani Award)తో సత్కరించింది. 2022లో తనయుడు ధృవ్ తో కలిసి మహాన్ తో అలరించిన విక్రమ్ నెక్ట్స్ మణిరత్నంతో డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్‌లో సినిమాతో సందడి చేయనున్నారు.
నడవలేడన్న డాక్టర్లు.. కానీ డెడికేషన్‌తో విక్రమ్
ఇదంతా ఓ ఎత్తైతే. యాక్టింగ్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న యంగ్ ఏజ్ లో బైక్ పై వెళుతూ... ఓ ట్రక్ వేగంగా వచ్చి విక్రమ్‌ను ఢీకొంది. డిగ్రీ చదువుతున్న రోజుల్లో జరిగిన ఈ ప్రమాదంతో ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏకంగా మూడు నెలల బెడ్ పైనే ఉన్నాడు. సొంతంగా లేచి నడవలేని పరిస్థితి. కాళ్లకు 23 ఆపరేషన్లు జరిగాయి. అసలు నడవటమే కష్టం.. లేచి కూర్చోవటమే కష్టం అని డాక్టర్లు అంటే... తనలో ఉన్న పట్టుదలతో లేచి కూర్చోవటమే కాదు, ఈ రోజు విక్రమ్‌గా అద్భుతమైన ఫిజిక్ తో తన యాక్టింగ్ తో మనల్ని మెస్మరైజ్ చేయలగలుగుతున్నారు చూడండి అదీ డెడీకేషన్ అంటే.... అందుకే ఏబీపీ దేశం ప్రౌడ్ లీ విషింగ్ యూ హ్యాపీ బర్త్ డే విక్రమ్ సర్ (Happy Birthday Vikram).
విక్రమ్ పేరు ఎలా వచ్చిందంటే..
విక్రమ్ అసలు పేరు కెనడీ జాన్ విక్టర్ కాగా, తల్లిదండ్రుల పేర్లు, తన అసలు పేరుతో కలిపి విక్రమ్ స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు. విక్రమ్ తండ్రి పేరు జాన్ విక్టర్ అలియాస్ వినోద్ రాజ్. తల్లి పేరు రాజేశ్వరి. తండ్రి క్రిస్టియన్ కాగా, తల్లి హిందువు. తండ్రి పేరులో తొలి అక్షరం ‘వి’ తన ఒరిజినల్ నేమ్‌లోని తొలి అక్షరం ‘కె’, తల్లి పేరు నుంచి తొలి అక్షరం ర (Ra). తమిళంలో అతడి రాశి నుంచి రమ్ తీసుకున్నాడు. వీటిని కలిపి తన పేరు విక్రమ్‌గా మార్చుకున్న నటుడు కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నారు.
Also Read: Tiger Nageswara Rao: హైదరాబాద్ లో స్టువర్ట్‌పురం - రవితేజ కోసం స్పెషల్ సెట్
Also Read: RRR: 'కొమ్మ ఉయ్యాలా, కోనా జంపాలా' వీడియో సాంగ్ చూశారా?