యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. రీసెంట్ గా 'కేజీఎఫ్2' విడుదల కావడంతో 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్ తగ్గాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం ఇప్పటికీ ఈ సినిమా దూసుకుపోతుంది. 


హీరోల పెర్ఫార్మన్స్, జక్కన్న మేకింగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలానే కీరవాణి అందించిన సంగీతం సినిమాకి మరో ఎసెట్ గా నిలిచింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ఓ చిన్న పాటతో మొదలవుతుంది. 'కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల' అంటూ ఓ చిన్నారి పాట పాడే సీన్ తో సినిమా మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. 


ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు. పూర్తి వీడియో సాంగ్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మెలోడీ ట్యూన్ కి అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ పాటను ప్రకృతి అనే చిన్నారి పాడిన సంగతి తెలిసిందే. 


Also Read: సెట్స్ లో చూసుకుందాం - రామ్ చరణ్ కి చిరు వార్నింగ్


Also Read: 'కేజీఎఫ్2' గ్యాంగ్‌స్టర్‌ ఫిల్మ్ కాదు - వాళ్లకి ఇదొక హారర్ ఫిల్మ్