మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 29కి వాయిదా వేశారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో 'భలే భలే బంజారా' అనే సాంగ్ ను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిన్న వీడియోను విడుదల చేశారు. ఇందులో దర్శకుడు కొరటాల శివ.. చిరు, రామ్ చరణ్ ల మధ్య సంభాషణ ఆకట్టుకుంది.
'భలే భలే బంజారా' సాంగ్ లో రామ్ చరణ్ తో పోటీ పడుతూ డాన్స్ చేయడానికి చిరంజీవి కష్టపడాల్సి వస్తుందని అన్నారు. దీంతో రామ్ చరణ్ ని తగ్గాలని అడగ్గా.. దానికి ఆయన తగ్గను డాడీ అని అనడం.. సెట్స్ లో చూసుకుందాం అని చిరు ఫన్నీగా వార్నింగ్ ఇవ్వడం నవ్విస్తుంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ కి జోడీగా పూజా కనిపించనున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తిరుణ్ణావుక్కరుసు సినిమాటోగ్రాఫర్. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి సినిమాలను తీయడంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
Also Read:'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?