మొన్నటివరకు దేశవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' హవా నడిచింది. ఇప్పుడేమో 'కేజీఎఫ్2' సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీలలో 'కేజీఎఫ్2' హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అందరూ కూడా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దానికి తగ్గట్లే భారీ వసూళ్లను రాబడుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ కి, యష్ పెర్ఫార్మన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.
బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజే ఈ సినిమా రూ.135 కోట్లు రాబట్టింది. ఒక్క బోలీవుడ్ ద్వారానే రూ.50 కోట్లు రావడం విశేషం. సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కేజీఎఫ్2' గురించి వరుస ట్వీట్లు పెట్టారు.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్2' గ్యాంగ్‌స్టర్ సినిమా కాదని.. బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇదొక హారర్ ఫిల్మ్ అని అన్నారు. ఈ సినిమా సక్సెస్ నుంచి బాలీవుడ్ తేరుకోవాలంటే కొన్నేళ్లు పడుతుందని వెటకారంగా కామెంట్స్ చేశారు. రాఖీ భాయ్ ముంబైకి వచ్చి గ్యాంగ్‌స్టర్స్‌పై మెషిన్ గన్‌తో దాడి చేసినట్లు యష్ బాలీవుడ్ స్టార్స్ ఓపెనింగ్ కలెక్షన్లపై మెషిన్ గన్‌తో దండెత్తాడని అన్నారు. ఫైనల్ కలెక్షన్స్ నాటికి శాండల్‌వుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ పై న్యూక్లియర్ బాంబ్ తో దాడి చేయడం ఖాయమని చెప్పుకొచ్చారు.
ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదని.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు కూడా కన్నడ సినీ ఇండస్ట్రీని అంత సీరియస్‌గా తీసుకోలేదని.. ప్రశాంత్ నీల్ ఆ ఇండస్ట్రీని ప్రపంచ మ్యాప్‌లో నిలబెట్టాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?