Guntur Kaaram First Single : 'గుంటూరు కారం' మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో పాట గురించి మరోసారి సోషల్ మీడియా అంతా ఒక్కటే డిస్కషన్. ఫస్ట్ సాంగ్ విడుదల ఎప్పుడు? అని కాదు! ఆల్రెడీ నెట్టింట వైరల్ అవుతున్న సాంగ్ ముందు విడుదల చేస్తారా? లేదంటే మరొకటా? అని! అసలు వివరాల్లోకి వెళితే...
'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'గుంటూరు కారం'. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ బర్త్ డే... నవంబర్ 7కు సాంగ్ ప్రోమో లేదా సాంగ్ విడుదల తేదీ ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే... ఇంతలో సోషల్ మీడియాలో ఓ సాంగ్ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది.
'గుంటూరు కారం'లో మసాలా బిర్యానీ రెడీ
వరుస విజయాలతో మంచి జోరులో ఉన్న సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ 'గుంటూరు కారం'లో ఓ సాంగ్ పాడారు. అదే 'మసాలా బిర్యానీ'. ఆ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే... 'గుంటూరు కారం' నుంచి విడుదల అయ్యే ఫస్ట్ సాంగ్ ఇది కాదని సమాచారం. తొలుత ఈ పాటను విడుదల చేయాలని ప్లాన్ చేసినా... ఎందుకో విరమించుకున్నారట! ఇప్పుడు మెలోడీ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేస్తారని టాక్. లీకైన 'మసాలా బిర్యానీ' తర్వాత వస్తుందని చెబుతున్నారు.
Also Read : 'పొలిమేర 2' రివ్యూ : థియేటర్లలో హిట్ అయ్యే కంటెంట్ ఉందా? ఫస్ట్ పార్ట్ కంటే బావుందా?
'మసాలా బిర్యానీ' మీద సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినబడుతున్నాయి. కొందరు బావుందని పోస్ట్ చేస్తుంటే... మరి కొందరు సాంగ్ బాలేదని కామెంట్ చేస్తున్నారు.
Also Read : కీడా కోలా రివ్యూ : తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుంది. ఆ రోజు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను - మాన్', తర్వాత రోజు (జనవరి 13న) విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'ఈగల్' సినిమాలు కూడా వస్తున్నాయి.