Actor Govinda Political Re entry Comments Viral: ఎన్నో కామెడీ సినిమాలు కితకితలు పెట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద మళ్లీ రాజకీయాల్లోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన.. ఇప్పుడు శివసేన (షిండే ష్యాక్షన్) లో చేరారు. దీంతో ఆయన గతంలో చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.
బాలీవుడ్ నటుడిగా, పొలిటికల్ లీడర్ గా గోవింద ఎంతోమందికి సుపరిచితం. సినిమా ఫీల్డ్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. అలా కాంగ్రెస్ లో చేరిన గోవింద 2004 లోక్ సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009లో అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు ఆయన. అయితే, కొన్ని అంతర్గత విబేధాల వల్ల ఆయనకు సీటు కేటాయించలేదు కాంగ్రెస్ పార్టీ. దీంతో మనస్తాపానికి గురైన ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత.. మళ్లీ సినిమాలు మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం శివసేన (షిండే ష్యాక్షన్) లో చేరారు.
మనకు పనికిరావు..
ఆయన శివసేనలో చేరడంతో 2012లో ఒక కార్యక్రమంలో చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. "రాజకీయాల్లో చేరడం అనేది నేను చేసిన అతిపెద్ద తప్పు. అది మన కప్ ఆఫ్ టీ కాదు. రాజకీయాలు మనకు పనికిరావు. అందుకే, నేను ఇంక ఏ పార్టీలో చేరాలని అనుకోవడం లేదు. నా లైఫ్ లో ఏదైనా మార్చుకునే ఛాన్స్ వస్తే.. నేను ఆ రోజులను మార్చుకుంటాను. నా పార్టీ వాళ్లే నన్ను మోసం చేశారు. రాజకీయాల తర్వాత సినిమాల్లోకి వెళ్లడం చాలా కష్టం అయ్యింది నాకు. వెయిట్ పెరిగిపోయాను. దాంతో పాత్రలు రాలేదు. తగ్గేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. ఇక రాజకీయాల్లోకి రాను" అంటూ ఆయన కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అంతా ఆయన్ను ట్రోల్స్ చేస్తున్నారు. "ఎంత సినిమా వాళ్లు అయినా రాజకీయం వంటబట్టిందిగా అలానే చెప్తుంటారులే" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
'అఖియోన్ సే గోలే మారే', 'ఛలో ఇష్క్ లడాయి' లాంటి హిట్ సినిమాలు చేసిన గోవింద.. 2004లో బీజేపీ క్యాండిడేట్ రామ్ నాయక్ ని ఓడించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ముంబైలోని నార్త్ నియోజకర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో శివసేన (షిండే ష్యాక్షన్) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ముంబై నార్త నియోజకర్గం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
Also Read: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!