Sai Durgha Tej : 'రెండు మెగా ఫోర్స్ లు ఒక్కటైతే ఎలా ఉంటుందో త్వరలోనే చూడబోతున్నారు' అంటూ సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న SDT 18 నుంచి క్రేజీ అప్డేట్ ని షేర్ చేశారు మేకర్స్. సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం SDT 18. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ లో మరో మెగా హీరో భాగం కాబోతున్నాడు అనేది ఈ అప్డేట్ సారాంశం.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలుగా, కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SDT 18. మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే "ఇంట్రూడ్ ఇంటు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ" అనే టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ టీజర్ లో సాయి దుర్గ తేజ్ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ఇక ఆ టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
డిసెంబర్ 12న SDT 18 సినిమా కార్నేజ్ ను రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. యూసఫ్ గూడా లోని శౌర్య కన్వెన్షన్ సెంటర్, పోలీస్ ఇండోర్ గ్రౌండ్స్ లో జరిగే గ్రాండ్ ఈవెంట్లో ఈ కార్నజ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లోనే రెండు మెగా పోర్స్ లు ఒక్కటి కాబోతున్నాయి. ఆ మెగా ఫోర్స్ లు మరెవరో కాదు... ఒకరు సాయి దుర్గ తేజ్ కాగా, మరొకరు రామ్ చరణ్. రామ్ చరణ్ ఈ గ్రాండ్ ఈవెంట్లో SDT 18 కార్నేజ్ ని స్వయంగా రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారన్నమాట. SDT 18 మేకర్స్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ తో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇందులో సాయి దుర్గా తేజ్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కథానాయకగా నటిస్తోంది. ఈ మూవీని తెలుగు తో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇక రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది. మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ షూటింగ్ ని షురూ చేశారు.
Also Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?