Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2 : ది రూల్' మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ ని రూల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాను ప్లే చేస్తున్న టైంలో ఓ థియేటర్లో వింత సంఘటన చోటు చేసుకుంది. థియేటర్ యాజమాన్యం 'పుష్ప 2' సెకండ్ హాఫ్ ను మాత్రమే స్క్రీనింగ్ చేసి ప్రేక్షకులని అయోమయంలో పడేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2 : ది రూల్' మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు థియేటర్లలో ఈ మూవీ ద్వారా మాస్ ఫీస్ట్ అందించాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. సాధారణంగా సినిమా అంటే ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, సెకండ్ ఆఫ్ ఉంటాయి. కానీ విచిత్రంగా కొచ్చిలోని సినీ పోలీస్ సెంటర్ స్క్వేర్ థియేటర్లో మాత్రం కేవలం సెకండ్ హాఫ్ తో సినిమాను పూర్తి చేశారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను చూడడానికి ఎంతో ఆతృతగా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విచిత్రమైన అనుభవం ఎదురైంది. థియేటర్ యాజమాన్యం పొరపాటున సినిమా మొత్తాన్ని ప్రేక్షకులకు చూపించకుండా, కేవలం సెకండ్ హాఫ్ ని మాత్రమే ప్లే చేశారట.
సాయంత్రం 6:30 గంటల షో సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీక్షకులు ఎండ్ టైటిల్స్ పడుతున్న టైంలో అది ఇంటర్వెల్ అని అనుకున్నారట. ఎందుకంటే ఈ ఆధునిక సినిమా యుగంలో నాన్ లీనియర్ గా కథను చెప్పే ధోరణి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం డౌట్ వచ్చి థియేటర్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారట. దాదాపు 3 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని తమ మిస్టేక్ వల్ల ప్రేక్షకులు చూడలేకపోయారని అసలు విషయం తరువాత తెలిసిందట. అది కూడా కొంతమంది థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్ళాక. వాళ్ళు చేసిన తప్పిదం వల్ల నిరాశ చెందిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారట.
కొంతమంది ఆడియన్స్ థియేటర్ యాజమాన్యం చేసిన తప్పుకి తమ టికెట్ రేట్లకు చెల్లించిన డబ్బుని వాపస్ చేయాలని డిమాండ్ చేయగా, కొంతమంది మాత్రం సినిమా మొదటి అర్ధ భాగాన్ని మళ్ళీ ప్లే చేయాలని పట్టుబట్టారట. దీంతో సినీ పోలీస్ మేనేజ్మెంట్ స్పందిస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ను రాత్రి 9 గంటల షో టైంలో దాదాపు పది మందికి ప్లే చేయాలని డిసైడ్ అయ్యిందట. ఇక డబ్బు వాపస్ కావాలని డిమాండ్ చేసిన వారికి కూడా రిఫండ్ చేస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి ఈ గోల్ మాల్ తర్వాత ప్రేక్షకుల డిమాండ్ ను థియేటర్ యాజమాన్యం ఒప్పుకోవడంతో, అందరూ సంతోషంగా ఇళ్లకు వెనుదిరిగినట్టు తెలుస్తోంది.
Also Read: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్