Just In





Pushpa 2 Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?
Pushpa 2 Box Office Collection Day 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వసూళ్ళ ఊచకోత బాక్సాఫీస్ బరిలో కంటిన్యూ అవుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. 500 కోట్లు జస్ట్ మిస్ అంతే.

Pushpa Day 2 Collection Worldwide: అల్లు అర్జున్ నట విశ్వ రూపానికి, గంగమ్మ జాతరలో చేసిన తాండవానికి బాక్సాఫీస్ ఫిదా అంది. రెండు రోజుల్లో పుష్ప 2 సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఒక రికార్డుకు కొంత దూరంలో ఆగింది. రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
పుష్ప 2 @ 449 కోట్లు... ఇదే రికార్డు!
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప 2' సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 449 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇంకో 51 కోట్లు కలెక్ట్ చేస్తే... రెండు రోజుల్లో 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్రకు ఎక్కేది. ఇప్పటికీ 450 కోట్ల మార్కును తక్కువ సమయంలో చేరుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది.
ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన 'బాహుబలి 2', అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తీసిన 'ట్రిపుల్ ఆర్' సినిమాలు మూడు రోజుల్లో 500 కోట్ల మార్కును చేరుకున్నాయి. ఆ సినిమాల సరసన ఇప్పుడు పుష్ప 2 నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'జవాన్' నాలుగు రోజుల్లో 500 కోట్ల మార్క్ చేరుకోగా... కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా మన తెలుగువాడు ప్రశాంత్ ని తీసిన 'కేజిఎఫ్ చాప్టర్ 2' సైతం నాలుగు రోజుల్లోనే 500 కోట్ల మార్క్ చేరుకుంది. ఇక షారుక్ 'పఠాన్' సినిమా 500 కోట్ల వసూళ్ల మార్క్ చేరుకోవడానికి ఐదు రోజులు పట్టింది.
Also Read: బూత్ బంగ్లాలో RC 16... అమెరికాలో Game Changer... ఇదీ డిసెంబర్‌లో రామ్ చరణ్ షెడ్యూల్
వీకెండ్ కలెక్షన్లు 650 కోట్లు దాటుతాయి!
బాక్సాఫీస్ బరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోరు హుషారు చూస్తుంటే 'పుష్ప 2' సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 650 కోట్ల రూపాయలను చేరే అవకాశం కనబడుతోంది. ఈ సినిమాకు శని, ఆదివారాల్లో భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్ల... మరో రెండు రోజుల్లో 200 కోట్లు కలెక్ట్ చేయడం కష్టమేమీ కాదు. వీకెండ్ కలెక్షన్లు 700 కోట్లను చేరిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
Also Read: హన్సిక నోటి వెంట జానీ మాస్టర్ పేరు... కేసులకు భయపడకుండా చెప్పేసిందిగా!
థియేటర్లలో జనాలకు పూనకాలు వస్తున్నాయ్!
లాజిక్కులు లేవని విమర్శకులు వేలెత్తి చూపిన సరే... 'పుష్ప 2' ప్రీ క్లైమాక్స్ ఫైట్ వచ్చినప్పుడు థియేటర్లో జనాలు పూనకాలతో ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా కపాలం అల్లు అర్జున్ మెడలో పడిన తర్వాత జనాలు జేజేలు పలుకుతున్నారు. గంగమ్మ జాతరతో పాటు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లో అన్నిటికీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.