క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా 'ఘాటి' (Ghaati Movie). క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్ చూస్తే... అనుష్క ఇంటెన్స్ వయలెంట్ క్యారెక్టర్ చేశారని అర్థం అవుతోంది. 'బాహుబలి' తర్వాత అనుష్క నటించిన పాన్ ఇండియా చిత్రమిది. నిజానికి ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన చిత్రమిది. అనూహ్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

జూలై 11న 'ఘాటి' థియేటర్లలో విడుదలAnushka Shetty's Ghaati Release Date: జూలై 11న థియేటర్లలోకి 'ఘాటి'ని తీసుకు వస్తున్నట్లు ఇవాళ అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Also Read: రాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!

యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం మీద రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి 'ఘాటి' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బ్లాక్‌ బస్టర్  'వేదం' తర్వాత అనుష్క, క్రిష్‌ కలయికలో రెండో చిత్రమిది. యువి క్రియేషన్స్‌ సంస్థలో అనుష్కకు నాలుగో సినిమా.

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ: చింతకింది శ్రీనివాస రావు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ క్రిషన్, కూర్పు: చాణక్య రెడ్డి తూరుపు - వెంకట్ ఎన్ స్వామి, మాటలు: సాయి మాధవ్ బుర్రా, కళా దర్శకుడు: తోట తరణి, ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి కాటసాని, సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్.