Ghaati Two Days Box Office Collection: బాక్సాఫీస్ బరిలో క్వీన్ అనుష్క శెట్టి 'ఘాటీ' ఎదురీదుతోంది. ఓపెనింగ్ డే ఈ సినిమా కలెక్షన్లు ఏమంత గొప్పగా లేవు. కేవలం రెండు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. రెండో రోజు పెరుగుతుంది అనుకుంటే అది లేదు. మొదటి రోజు కంటే తగ్గింది. క్రిటిక్స్ నుంచి మాత్రమే కాదు... సగటు సినిమా ప్రేక్షకుల నుంచి కూడా ఘాటీకి మిశ్రమ స్పందన లభించింది. దాంతో థియేటర్ల దగ్గర జనాలు లేక వసూళ్లు తగ్గాయి.
రెండో రోజు ఘాటీ కలెక్షన్లు ఎంత అంటే?Ghaati 2nd Day Collection: ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రెండు కోట్లు కలెక్ట్ చేసిన 'ఘాటీ'కి రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదరణ మరింత తగ్గింది. కేవలం కోటి 70 లక్షల మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే వసూళ్లు 13% తగ్గాయి. రెండో రోజు వచ్చిన రూ. 1.74 కోట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. శనివారం జరిగిన బుకింగ్స్ లేదా టికెటింగ్ యాప్‌లలో జరిగిన సేల్స్ చాలా తక్కువ. రెండు రోజుల్లో 'ఘాటీ' కలెక్షన్లు రూ. 3.74 కోట్లు మాత్రమే. ఈ వసూళ్లతో సినిమా గట్టెక్కడం కష్టమే.
హైదరాబాద్ సిటీలో శనివారం వినాయక నిమజ్జనం కార్యక్రమం ఉండడం కూడా కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది. థియేటర్లకు రావడం కంటే గణేషుడిని సాగనంపడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపించారు. మరి వీకెండ్ అయినటువంటి ఆదివారం అయినా సరే థియేటర్లకు ఆడియన్స్ వస్తారో లేదో చూడాలి.
Also Read: అనుష్క సినిమాను బీట్ చేసిన కల్యాణి ప్రియదర్శన్ మూవీ... ఫస్ట్ డే కలెక్షన్లలో షాకింగ్ రిజల్ట్!
'ఘాటీ' విడుదలకు ముందు అనుష్క నేరుగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదు. కానీ ఫోన్ కాల్స్ ద్వారా తన వీలైనంత వరకు ప్రచారం చేసింది. దర్శకుడు క్రిష్ సహా నిర్మాత రాజీవ్ రెడ్డి, హీరో విక్రమ్ ప్రభు, విలన్ చైతన్య రావు తదితరులు వీడియో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ప్రచారం గట్టిగా చేశారు. విడుదలైన తర్వాత టీవీ ఛానళ్లలో క్రిష్ అండ్ కో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆయన చేస్తున్న కృషికి ఫలితం లభిస్తుందా? థియేటర్లకు జనాలు వస్తారా? లేదా? అన్నది చూడాలి.
Anushka Shetty's Ghaati Movie Collections: 'ఘాటీ'ని చూడడం కంటే పది రోజుల క్రితం విడుదలైన మలయాళ సినిమా 'కొత్త లోక చాప్టర్ 1 చంద్ర'ను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 'ఘాటీ'తో పాటు విడుదలైన వినోదాత్మక సినిమా 'లిటిల్ హార్ట్స్' చూసేందుకు జనాలు వెళుతున్నారు. ఇక తమిళ డబ్బింగ్ మదరాసికి సైతం తెలుగునాట ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మొదటి రోజు ఆ సినిమా కూడా అంతగా కలెక్ట్ చేయలేదు. రెండో రోజు శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమాకు కూడా వసూళ్లు తగ్గాయి.
Also Read: తమిళ్ దర్శకులకు ఏమైంది? బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు... అసలు కారణాలు ఇవేనా!?