Ghaati Vs Kotha Lokah: First Day Box Office Comparison - ఇండియన్ బాక్స్ ఆఫీస్ బరిలోకి పది రోజుల వ్యవధిలో రెండు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేయగా, మలయాళీ అమ్మాయి - తెలుగులోనూ సినిమాలు చేసిన కల్యాణీ ప్రియదర్శన్ ఫిమేల్ సూపర్ హీరో రోల్ చేసిన 'లోక' ఒకటి. తెలుగులో దానిని 'కొత్త లోక' పేరుతో విడుదల చేశారు. క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'ఘాటీ' మరొకటి. రెండు సినిమాలకు ఫస్ట్ డే బాక్స్ కలెక్షన్స్ చూస్తే ఆడియన్స్ షాక్ అవుతారు.

కలెక్షన్లలో కల్యాణీ కుమ్ముడు...అనుష్క 'ఘాటీ'కి దక్కని ఆదరణ!మలయాళంలో కల్యాణీ ప్రియదర్శన్ 'లోక' ఆగస్టు 28న విడుదలైంది. తెలుగులో 29న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ మార్నింగ్ షోస్ పడలేదు. ఈవెనింగ్ & లేట్ నైట్ షోస్, అదీ కొన్ని ఏరియాల్లో మాత్రమే పడ్డాయి. తెలుగులో ప్రోపర్ పబ్లిసిటీ చేయలేదు. అయినా సరే ఆడియన్స్ ఆదరించారు. అసలు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే... 

మలయాళంలో మొదటి రోజు 'లోక'కు రూ. 2.70 కోట్లు వచ్చాయి. ప్రీమియర్స్, ఫస్ట్ డే హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు. దాంతో కేవలం మలయాళ వెర్షన్ రూ. 3.65 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో 35 లక్షల రూపాయలు వచ్చాయి. ఆగస్టు 30న తెలుగులో పూర్తి స్థాయిలో సినిమా విడుదల అయ్యింది. ఆ రోజు రూ. 1.20 కోట్లు కలెక్ట్ చేసింది. టాలీవుడ్ క్రిటిక్స్ కూడా సినిమా బావుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుకంజ వేయలేదు. రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 

'లోక' విడుదలైన ఎనిమిది రోజులకు అనుష్క శెట్టి 'ఘాటీ' విడుదలైంది. ఈ మూవీకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా? రూ. 2 కోట్లు మాత్రమే. కొన్ని ట్రేడ్ పోర్టల్స్ రూ. 2.5 కోట్లు అని రిపోర్ట్ చేశాయి. ఆ లెక్కన చూసినా సరే కల్యాణీ ప్రియదర్శన్ 'లోక' ఫస్ట్ డే కలెక్షన్స్ బీట్ చేయడంలో అనుష్క 'ఘాటీ' ఫెయిల్ అయ్యింది. 'లోక' ఫస్ట్ డే రూ. 2.75 కోట్లు కలెక్ట్ చేస్తే... 'ఘాటీ' రూ. 2 కోట్లతో సరిపెట్టుకుంది. 

తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ మార్కెట్టుతో కంపేర్ చేస్తే కేరళలో మాలీవుడ్ మూవీస్ మార్కెట్టు తక్కువ. దుబాయ్ వంటి దేశాల్లో మలయాళ సినిమాలకు ఆదరణ చాలా బావుంటుంది. అయినా సరే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు వచ్చిన వసూళ్ల స్థాయిలో మాలీవుడ్ హీరోలకు కలెక్షన్స్ రావు. అనుష్కతో కంపేర్ చేస్తే కల్యాణీ ప్రియదర్శన్ రేంజ్, స్టార్‌డమ్ తక్కువ. ఇప్పుడు కల్యాణీ 'లోక' స్థాయిలో అనుష్క 'ఘాటీ'కి ఓపెనింగ్స్ రాలేదు.

Also Read: తమిళ్ దర్శకులకు ఏమైంది? బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు... అసలు కారణాలు ఇవేనా!?

'లోక'కు దుల్కర్ సల్మాన్ బ్రాండ్ వేల్యూ యాడ్ అయ్యింది. 'ఘాటీ'కి అనుష్కకు తోడు క్రిష్ బ్రాండ్ వేల్యూ యాడ్ అయ్యింది. పబ్లిసిటీలో రానా, అల్లు అర్జున్ ఓ చెయ్యి వేశారు. క్రిష్, విక్రమ్ ప్రభు, చైతన్య రావు విపరీతమైన ప్రచారం చేశారు. టీజర్, ట్రైలర్లకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగా వచ్చింది. అయినా థియేటర్లకు ఆడియన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ దరిదాపుల్లోకి సినిమా వచ్చే ఛాన్సుల్లేవ్ అట.

Also Readమదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్న శ్రియ... అప్పుడు 'దృశ్యం', 'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు 'మిరాయ్'